Bhumika Chawla: టాలీవుడ్ స్టార్ హీరోల గురించి భూమిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ హీరో చాలా క్యూట్ అంటూ..

మహేష్, పవన్, తారక్ సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి.

Bhumika Chawla: టాలీవుడ్ స్టార్ హీరోల గురించి భూమిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ హీరో చాలా క్యూట్ అంటూ..
Bhumika

Updated on: Oct 09, 2022 | 4:21 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో భూమిక ఒకరు. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. మహేష్, పవన్, తారక్ సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. మహేష్ బాబు నటించిన ఒక్కడు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, తారక్ తో సింహాద్రి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది భూమిక. ఇక చాలా కాలం సినిమాలకు దూరమైంది ఈ బ్యూటీ. అప్పట్లో తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్న భూమిక ఇప్పుడు సహాయ పాత్రల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ధోని సినిమాలో సుశాంత్ అక్కగా నటించి అలరించారు భూమిక. అలాగే తెలుగులో నాని నటించిన ఎమ్.సీ.ఏ సినిమాలో వదిన పాత్రలో నటించింది భూమిక.

తాజాగా భూమిక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భూమిక మహేష్ బాబు గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంట్రవ్యూలో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా చిరంజీవి గ్రేట్ డ్యాన్సర్ అని చెప్పుకొచ్చిన భూమిక. జూనియర్ ఎన్టీఆర్ ఫంటాస్టిక్ డ్యాన్సర్ అని పవన్ కళ్యాణ్ వెరీ ఇంటెలిజెంట్ అని మహేష్ బాబు వెరీ క్యూట్ అని భూమిక తెలిపారు. ఇక  వెంకటేష్ స్పిరిచ్యువల్ అని భూమిక కామెంట్ చేశారు.

రీసెంట్ గా భూమిక సీతారామం సినిమాలో చిన్న పాత్రలో నటించారు. ఈ సినిమాలో సుమంత్ భార్యగా భూమిక కనిపించారు. అలాగే ప్రస్తుతం పలు సినిమాల్లో ఆమె చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.