Bheemla Nayak Review: భీమ్లా నాయక్ సినిమా థియేటర్ల వద్ద దుమ్మురేపుతోంది. అటు మెగా ఫ్యాన్స్, ఇటు రానా ఫ్యాన్స్.. మొత్తంగా తెలుగు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. త్రివిక్రమ్(Trivikram Srinivas) మార్క్ డైలాగ్స్, థమన్( Thaman) మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక పవన్, రానా పోటీ పడి నటించారు. సినిమా బ్లాక్ బాస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. శుక్రవారం హౌస్‌ఫుల్ కలెక్షన్లు నడిచాయి. శని, ఆదివారం కూడా అదే క్రౌడ్ కొనసాగనుంది. తొలిరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 26 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 34 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు బీమ్లా నాయక్. ఏపీలో థియేటర్ల సమస్య ఉంది. బెనిఫిట్ షోలు లేవు. టికెట్ రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడే కలెక్షన్ల నుంచి కొంచెం కలెక్షన్ల డ్రాప్ ఉందని సమాచారం. భీమ్లా నాయక్ 108 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. ప్రజంట్ సిట్యువేషన్స్ చూస్తుంటే.. మొదటి వీకెండ్ అయ్యేలోపే పవన్-రానాల మూవీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించింది. సాగర్ కె.చంద్ర మూవీకి డైరెక్షన్ చేయగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు చేశారు. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటించారు. పవన్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటించారు.
Also Read: ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది.. ఈ మొక్క గుణాలు తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే