Saranya Mohan: ఓరి దేవుడా.. ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..? ఇప్పుడు ఇలా..

|

Oct 06, 2024 | 2:47 PM

తెలుగులో నటుడు కృష్ణుడు హీరోగా చేసిన విలేజ్‌లో వినాయకుడు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శరణ్య మోహన్. అయితే నానితో చేసిన భీమిలి కబడ్డీ జట్టుతో అమ్మడికి గుర్తింపు దక్కింది. తను ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తోంది..?

Saranya Mohan: ఓరి దేవుడా.. ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..? ఇప్పుడు ఇలా..
Saranya Mohan
Follow us on

నేచురల్ స్టార్ అనే ట్యాగ్ దక్కించుకోవడమే కాదు. విభిన్నబమైన సినమాలకు కేరాఫ్ అయ్యాడు నాని. ఇప్పటివరకు అతని సినిమాలు చూస్తేనే.. నాని కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకున్నాడో అర్థం అవతుంది. మరోవైపు మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తూ అమ్మాయిల్లో పాపులారిటీ కూడా బాగా సంపాదించుకున్నాడు. సినిమా ఫలితం ఎప్పుడైనా తేడా కొట్టినా.. నటుడిగా మాత్రం నాని ఫెయిల్ అవ్వడు. నాని కెరీర్‌లో భీమిలి కబడ్డీ జట్టుకు మంచి క్లాసిక్‌గా చెప్పుకోవాలి. ఈ సినిమా వాస్తవిక ప్రపంచానికి చాలా దగ్గరిగా ఉంటుంది. సినిమాలో బోలెడంత ఫన్ కూడా ఉంటుంది.  ఈ సినిమాలో అమాయకపు పల్లెటూరి యువకుడిగా నటించి సూపర్ అనిపించాడు మన నాని. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే జనాలు తెగ చూసేస్తారు.  తాతినేని సత్య డైరెక్షన్‌లో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు 2010లో రిలీజైంది. కబడ్డీ  నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ మూవీ వెన్నిళ కబడి కుళుకు రీమేక్.

ఇక ఈ  మూవీతో నానికి జోడిగా శరణ్య మోహన్ నటించింది. ఆ అమ్మాయి, నాని మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఎంతో సహజత్వంగా చిత్రీకరించారు. శరణ్య మోహన్ తన అమాయకపు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత తనకు ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. అటు తమిళ్, మలయాళ సినిమాల్లో యాక్ట్ చేసి తన మార్క్ అయితే వేసేసింది. తెలుగులో నటుడు కృష్ణుడు లీడ్ రోల్ చేసిన విలేజ్‌లో వినాయకుడు సినిమాతో మన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శరణ్య. ఆతర్వాత భీమిలి కబడ్డీ, హ్యాపీ హ్యాపీగా, కళ్యాణ్ రామ్ కత్తి చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక శరణ్య ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. తన చిన్ననాటి ఫ్రెండ్, డాక్టర్ అరవింద్ కృష్ణన్‌ను ఆమె 2015 లో మ్యారేజ్ చేసుకుంది ఈ భామ. వీరికి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఫోటోస్ పోస్ట్ చేస్తోంది.. శరణ్య. ఆమె లేటెస్ట్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం పదండి…


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.