The Family Man 2: ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ పై ముదురుతున్న వివాదం.. సిరీస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన సీనియర్ డైరెక్టర్

|

Jun 09, 2021 | 3:01 PM

ది ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలో అనుకున్నంతా అయ్యింది. ట్రైలర్‌తో రచ్చ రచ్చ అయిన వ్యవహారం... షో స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన తరువాత మరింత ముదురుతుందని భావించారు.

The Family Man 2: ఫ్యామిలీ మ్యాన్ 2 పై ముదురుతున్న వివాదం.. సిరీస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన సీనియర్ డైరెక్టర్
The Family Man 2
Follow us on

The Family Man 2:

ది ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలో అనుకున్నంతా అయ్యింది. ట్రైలర్‌తో రచ్చ రచ్చ అయిన వ్యవహారం… షో స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన తరువాత మరింత ముదురుతుందని భావించారు. కానీ రిలీజ్ అయిన తరువాత రెండు రోజుల పాటు ఎలాంటి విమర్శలు రాకపోవటంతో… ఇక అంతా సద్దు మనిగినట్టే అనుకున్నారు. కానీ అసలు వివాదం ఇప్పుడే మొదలైంది. ట్రైలర్ రిలీజ్ సమయంలో కేవలం ఎల్టీటీఈని తప్పుగా చూపించారన్న విమర్శలు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఈ షోలో పూర్తిగా తమిళులనే తప్పుగా చూపించారంటున్నారు ఆందోళన కారులు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఎగైనిస్ట్ తమిళ్స్‌ అనే హ్యాస్‌ ట్యాగ్‌ను నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఫ్యామిలీ మ్యాన్ 2 స్ట్రీమింగ్ ఆపకపోతే అమెజాన్‌ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఎల్టీటీఈతో పాటు వాళ్ల నేత ప్రభాకరన్‌ను కూడా తప్పుగా చూపించారంటున్నారు ఆందోళన కారులు. ఎల్టీటీఈ సోల్జర్స్ మందు తాగినట్టుగా చూపించటం, ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు పెట్టుకున్నట్టు చూపించటంపై మండి పడుతున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో న‌డుస్తోంది. ఈ విష‌యంపై తాజాగా సీనియర్‌ దర్శకుడు భారతీరాజా కూడా మండిప‌డ్డారు.  తమిళ జాతికి వ్యతిరేకంగా ‘ది ఫ్యామిలీ మెన్‌ 2’ వెబ్‌ సిరీస్ రూపొందింద‌ని, దాన్ని ప్రసారం చేయకూడద‌ని విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప‌ట్టించుకోకపోవ‌డం బాధాకరమని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ను తమిళ ద్రోహులు రూపొందించార‌ని అన్నారు.  ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.మరి టైలర్ రిలీజ్ సమయంలో షో చూసి మాట్లాడమన్న మేకర్స్… ఈ కొత్త వివాదం మీద ఎలా రియాక్డ్ అవుతారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Radhe Shyam Movie: ఓటీటీ సంస్థల చూపు ‘రాధేశ్యామ్’ మూవీ పైనే.. ప్రభాస్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చిన ప్రైమ్ ?

Bimbisara Movie: కళ్యాణ్ రామ్ సినిమాలో భాగం కానున్న ఎన్టీఆర్.. ‘బింబిసార’ కోసం యంగ్ టైగర్ వాయిస్ ?

నేను చేస్తున్న సేవని వెనక ఉండి నడిపిస్తుంది వాళ్లే..!సోను సూద్ ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూ టీవీ 9 లో లైవ్ వీడియో.:Sonu Sood video.