Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్‌ను మణిరత్నం కంటే ముందు ఎవరు తెరకెక్కించాలనుకున్నారో తెలుసా..

|

Oct 05, 2022 | 9:36 AM

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో  ఈ సినిమా విడుదలైంది. అన్ని ప్రాంతాలనుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్‌ను మణిరత్నం కంటే ముందు ఎవరు తెరకెక్కించాలనుకున్నారో తెలుసా..
Ponniyin Selvan
Follow us on

మణిరత్నం తెరకెక్కించిన దుశ్యకావ్యం పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో  ఈ సినిమా విడుదలైంది. అన్ని ప్రాంతాలనుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ప్రజాదరణ పొందిన ఒక నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు మణిరత్నం. కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం నటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదలైన ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించగా..సీనియర్ రైటర్ జయమోహన్ డైలాగులు రచించారు. అయితే ఈ సినిమాను గతంలో చాలా మంది తెరకెక్కించాలని ప్రయత్నించారు కూడా..

ప్రముఖ నటుడు, డైరెక్టర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) కూడా ఈ నవలను సినిమాగా తీయాలనుకున్నారు. 1958లో పొన్నియిన్ సెల్వన్ సినిమా తీయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో వైజయంతిమాల, సావిత్రి, జెమినీ గణేశన్, సరోజా దేవి, బాలయ్య కీలకపాత్రల్లో నటించనున్నట్లు తెలిపారు. కానీ, ఇది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఈ నవలను సినిమా రూపంలో తీసుకురావడం గురించి హీరో కమల్ హాసన్ కూడా చాలాసార్లు మాట్లాడారు. కానీ, అది జరగలేదు.

ఆ తర్వాత ఈ నవలను సినిమాగా తీసుకురావడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మణిరత్నం 1990ల్లోనే ప్రకటించారు. తర్వాత అనేక సార్లు దీని గురించి మాట్లాడారు. కానీ, ఆయన ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. చివరకు, 2019లో లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు మణిరత్నం ప్రకటించారు. ఈ సినిమా నిర్మాణ వ్యయాన్ని లైకా ప్రొడక్షన్ భరించింది. రెండు భాగాలకు కలిపి దాదాపు 500 కోట్లు ఖర్చు అయి ఉండొచ్చు అని టాక్. త్వరలోనే పొన్నియన్ సెల్వన్ సెకండ్ పార్ట్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..