Beast: రచ్చ రచ్చ చేస్తున్న దళపతి ఫ్యాన్స్.. కుర్చీలు విరగ్గొట్టి.. అద్దాలు పగలగొట్టి వీరంగం..

దళపతి విజయ్ నటించిన బీస్ట్(Beast) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి

Beast: రచ్చ రచ్చ చేస్తున్న దళపతి ఫ్యాన్స్.. కుర్చీలు విరగ్గొట్టి.. అద్దాలు పగలగొట్టి వీరంగం..
Beast Movie

Updated on: Apr 13, 2022 | 3:54 PM

దళపతి విజయ్ నటించిన బీస్ట్(Beast) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ కు ముందు వచ్చిన ట్రైలర్, పాటలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. విజయ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ కు పూనకాలే.. థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. భారీ కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ అభిమానులు హడావిడి చేస్తుంటారు. బీస్ట్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు హంగామా చేస్తున్నారు. సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్స్ దగ్గర సంబరాలు డబుల్ అయ్యాయి. ఇదిలా ఉంటే కొన్ని థియేటర్స్ దగ్గర విజయ్ అభిమానులు వీరంగం సృష్టిస్తున్నారు. థియేటర్ అద్దాలు, కుర్చీలను విరగ్గొడుతూ హంగామా సృష్టిస్తున్నారు. తాజాగా కోయంబత్తూర్ లోని ఓ థియేటర్ దగ్గర విజయ్ అభిమానులు నానా హడావిడి చేశారు.

కోయంబత్తూరులోని రోహిణి థియేటర్‌ లో బీస్ట్ సినిమా బెనిఫిట్ షో చూసేందుకు విజయ్ అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే కొంతమందికి టికెట్స్ దొరక్క పోవడంతో గందరగోళం సృష్టించారు. వేల సంఖ్యలో ఉన్న విజయ్ అభిమానులు ఒక్కసారిగా థియేటర్ పై విరుచుకుపడ్డారు. థియేటర్ పై రాళ్లు రువ్వారు. థియేటర్ సైడ్‌ వాల్‌లపై ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ డిస్‌ప్లేలను ధ్వంసం చేశారు. థియేటర్ యాజమాన్యం, సిబ్బంది వారిని అదుపు చేయలేక పోయారు. అలాగే పలు థియేటర్ల దగ్గర విజయ్ అభిమానుల కోలాహలం కనిపించింది. థియేటర్స్ లోపల కూడా క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు. థియేటర్స్ లోని కుర్చీలపై ఫ్యాన్ డ్యాన్స్ లు చేయడంతో అవి విరిగిపోయాయి. మరికొన్ని థియేటర్లలో ఒక్కసారిగా అభిమానులు పోటెత్తడంతో ఎంట్రన్స్ లోని అద్దాలు పగిలిపోయాయి. దాంతో థియేటర్ యజమానులు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.