Bangarraju: అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగచైతన్య కూడా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, కృతి శెట్టి తోపాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు. ప్రెస్ మీట్ ను లైవ్ లో ఇక్కడ చూడండి.
మరిన్ని ఇక్కడ చదవండి :