బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెకు బెంగుళూరు కోర్టు గురువారం షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఆమె శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. హేమ నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. అటు.. హేమ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలను బెంగళూరు సీసీబీ న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న NDPS స్పెషల్ కోర్టు న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో జూన్3న అరెస్టైన హేమ.. ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు.
మే 19న బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీలోని ఓ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరగ్గా.. ఇందులో దాదాపు వంద మందికి వరకు పాల్గొన్నారు. వీరందరి బ్లడ్ శాంపిల్స్ పరీక్షించగా.. 59 మంది పురుషులు, 27 మంది మహిళలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. మొత్తం 103 మంది పాల్గొన్న పార్టీలో.. సూత్రధారులుగా భావిస్తున్న వారిని అరెస్టు చేశారు బెంగుళూరు పోలీసులు. ఇందులో సినీ నటి హేమకు కూడా పాజిటివ్ రావడం..దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నటి హేమ బెయిల్ కోసం అప్లై చేసుకోవడంతో వాదనల తర్వాత ఆమెకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. ఇవాళ హేమ విడుదల అయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.