Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదంపై బండ్ల గణేష్ ట్వీట్..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కాగా బండ్ల గణేశ్ ఈ ప్రమాదంపై స్పందించారు.

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదంపై బండ్ల గణేష్ ట్వీట్..
Sai Tej Bandla Ganesh

Updated on: Sep 11, 2021 | 9:40 AM

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మాదాపూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వెళ్తూ..  సాయి ధరమ్ తేజ్ స్కిడ్‌ అయి పడిపోయారు. స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్‌‌లో షిఫ్ట్ చేశారు. అయితే హెల్మెట్ ధరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అతి వేగంగా బైక్ నడపడంతో అతడిపై కేసు కూడా నమోదు చేశారు. ఇక యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఇసుక ఉండటంతో.. అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని చికిత్సకు స్పందిస్తున్నాడని డాక్టర్లు తెలిపారు. అభిమానులెవ్వరూ ఆందోళన చెందవద్దని చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. చిరుతో పాటు పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ ఇతర కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మరో వైపు సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం, దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. అతడు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ భక్తుడు బండ్ల గణేశ్ కూడా సాయి ధరమ్ తేజ్ గురించి ట్వీట్ వేశారు. సుప్రీం హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

“దేవుడు నీతోనే ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు.. కోలుకుంటున్నారు.. ఆందోళన చెందకండి. ఆస్పత్రిలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు” అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

బండ్ల గణేశ్ ట్వీట్ దిగువన చూడండి

Also Read: మెగా హీరోకు యాక్సిడెంట్ అవ్వడానికి ఆ ప్రాంతంలో ఇసుకే కారణమా..? లేటెస్ట్ అప్‌డేట్

ఎంత కష్టం వచ్చింది తల్లి.. కుమారుడి చితికి తలకొరివి పెట్టిన అమ్మ