Bandla Ganesh: ‘అదే ఎక్కువైంది’.. ఆ టాలీవుడ్ హీరో సినిమాకు బండ్ల గణేశ్ రివ్యూ

సినిమాలు చేసినా, చేయకపోయినా తరచూ వార్తల్లో ఉంటాడు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్. సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలో బండ్లన్న చేసే కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులు తరచూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అలా ఇటీవల రిలీజైన ఒక సినిమాకు వెరైటీగా రివ్యూ ఇచ్చి మరోసార వార్తల్లో నిలిచాడు బండ్లన్న.

Bandla Ganesh: అదే ఎక్కువైంది.. ఆ టాలీవుడ్ హీరో సినిమాకు బండ్ల గణేశ్ రివ్యూ
Bandla Ganesh

Updated on: Dec 14, 2025 | 6:26 PM

ఇటీవల కాలంలో పలు సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లకు బాగానే హాజరవుతున్నారు బండ్ల గణేష్. అయితే కొన్నిసార్లు ఈయన ఇతర హీరోలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా మాట్లాడిన తీరు వివాదాలకు కారణమవుతోంది. ఇక బండ్లన్న సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. అసలు విషయంలోకి వెళితే.. స్టార్ యాంకర్ సుమ రోషన్ కనకాల హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మోగ్లీ. కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన సినిమాలో సాక్షి అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది. శనివారం (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు రూ.1.20 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. క్రమంలో అల్లు అర్జున్ లాంటి పలువురు సినీ ప్రముఖులు మోగ్లీ సినిమాకు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. తాజాగా బండ్ల గణేష్ సైతం మోగ్లీ సినిమా పై స్పందించాడు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

వైల్డ్ బ్లాక్‌బస్టర్” ట్యాగ్ చూశాక అనుకున్నా… పోస్టర్ మాటలే, సినిమా వేరేలా ఉంటుందేమో అని.. కానీ సినిమా చూసాక అర్థమైంది ,పోస్టర్ ఇంకా సాఫ్ట్ గా ఉందని! ప్రత్యేకంగా చెప్పాలి మా సుమ రాజీవ్ కొడుకు అని స్టార్టింగ్ లో అనుకున్నా… కానీ స్క్రీన్ మీద చూసాక అర్థమైంది రోషన్ కనకాల అనే నటుడు పుట్టాడు . ఇది అతని రెండో సినిమా. డైరెక్టర్ సందీప్ రాజ్ రైటింగ్, మాటల్లో సింప్లిసిటీ, సీన్స్ లో క్లారిటీ! ఇక బండి సరోజ్ కుమార్ విలనిజం, విలన్ కదా అని ఎక్కువ చేయలేదు. అదే ఎక్కువ అయ్యింది. సాక్షి అమాయకత్వం సినిమాకి చక్కని బ్యాలెన్స్! కాల భైరవ మ్యూజిక్ సీన్ కి అవసరమైన చోటే వచ్చి పని చేసింది!! విశ్వప్రసాద్ గారి సినిమా టేస్ట్ టేస్ట్ అంటే ఇదే అని మళ్లీ గుర్తు చేశారు! మొత్తానికి మోగ్లీ సినిమా చూసాక “వైల్డ్” అనే మాటకి అర్థం అప్‌డేట్ అయింది! కంగ్రాట్స్ టీమ్ మోగ్లీ . ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. మనం థియేటర్ లో నవ్వుతూ బయటకి రావాలిఅని రాసుకొచ్చారు బండ్ల గణేశ్.

ఇవి కూడా చదవండి

బండ్ల గణేశ్ ట్వీట్..

ప్రస్తుతం బండ్లన్న ట్వీట్ వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.