Bandla Ganesh: మ‌ళ్లీ వెండి తెర‌పై క‌నిపించ‌నున్న బండ్ల గణేశ్‌.. అయితే ఈసారి ఏకంగా హీరోగా.? త‌మిళ రీమేక్‌లో.. 

|

Apr 27, 2021 | 7:17 PM

BandlaGanesh As Hero: తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు బండ్ల గణేశ్ పేరును ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. క‌మెడియన్ కెరీర్ మొదలు పెట్టిన బండ్లా.. ఒక్క‌సారిగా బ‌డా నిర్మాత‌గా మారి అంద‌రి..

Bandla Ganesh: మ‌ళ్లీ వెండి తెర‌పై క‌నిపించ‌నున్న బండ్ల గణేశ్‌.. అయితే ఈసారి ఏకంగా హీరోగా.? త‌మిళ రీమేక్‌లో.. 
Bandla Ganesh
Follow us on

BandlaGanesh As Hero: తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు బండ్ల గణేశ్ పేరును ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. క‌మెడియన్ కెరీర్ మొదలు పెట్టిన బండ్లా.. ఒక్క‌సారిగా బ‌డా నిర్మాత‌గా మారి అంద‌రి దృష్టిని ఒక్క‌సారిగా త‌న‌వైపు తిప్పుకున్నారు. బ‌డా హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు తెర‌కెక్కిస్తూ దూసుకెళ్లారు.  స్వ‌త‌హాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు విరాభిమాని అయిన బండ్ల గణేశ్ మైక్ దొరికితే చాలా అత‌ని గురించి పొగుడుతూ వార్త‌ల్లో నిలుస్తుంటారు.

ఇదిలా ఉంటే చాలా రోజుల‌పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చిన బండ్లా.. తాజాగా మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో మ‌ళ్లీ వెండి తెర బాట‌ పట్టారు. మ‌ధ్య‌లో రాజ‌కీయాల్లోకి కూడా వెళ్లి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. ఇక తాజాగా మ‌రోసారి సిల్వ‌ర్ స్ర్కీన్‌పై క‌నిపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు బండ్ల గణేశ్‌. అయితే ఈసారి ఏకంగా హీరోగా అని స‌మాచారం. త‌మిళంలో వ‌చ్చిన మండెల అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి గణేశ్ తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఓ ద‌ర్శ‌కుడు ఇందులో బండ్ల గణేశ్ హీరోగా నటిస్తే బాగుంటుంద‌ని సూచించార‌ట ఇందుకు ఆయ‌న కూడా సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Support to India: త్రివర్ణంతో మెరిసిపోయిన అబుదాబీలోని యాస్ ద్వీపం..కష్ట సమయంలో వారిచ్చిన మద్దతుకు నెటిజనం ఫిదా!

Hare Swimming: మీరు ఎప్పుడన్నా కుందేలు నీటిలో ఈత కొట్టడం చూశారా? ఈ వీడియో చూడండి! మీరు రిలాక్స్ అవడం గ్యారెంటీ!

రెండు వేల నోటు ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఒక్కో నోటుకు ఒక్కో ఖర్చు ఉంటుందని తెలుసుకోండి!