BalaKrishna: 50 ఏళ్ల కెరీర్‌‌లో వెంకటేష్ కోసం మాత్రమే రూల్ బ్రేక్ చేసిన బాలకృష్ణ

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఆయన సినిమా కెరీర్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన సెంటిమెంట్లను పాటిస్తుంటారు. ముఖ్యంగా, తన 50 ఏళ్ల కెరీర్‌లో, బాలయ్య తన తండ్రి ఎన్టీ రామారావు సినిమాల్లో తప్ప మరే ఇతర హీరో సినిమాలోనూ ..

BalaKrishna: 50 ఏళ్ల కెరీర్‌‌లో వెంకటేష్ కోసం మాత్రమే రూల్ బ్రేక్ చేసిన బాలకృష్ణ
Balayya And Venkatesh1

Updated on: Dec 13, 2025 | 9:38 PM

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఆయన సినిమా కెరీర్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన సెంటిమెంట్లను పాటిస్తుంటారు. ముఖ్యంగా, తన 50 ఏళ్ల కెరీర్‌లో, బాలయ్య తన తండ్రి ఎన్టీ రామారావు సినిమాల్లో తప్ప మరే ఇతర హీరో సినిమాలోనూ గెస్ట్ రోల్ (అతిథి పాత్ర) చేయలేదు. దీనిని ఆయన ఒక సెంటిమెంట్‌గా భావించేవారు. అయితే, ఈ బలమైన సెంటిమెంట్‌ను కూడా ఒకే ఒక్క హీరో కోసం బాలయ్య పక్కన పెట్టారు. ఆ హీరో మరెవరో కాదు… విక్టరీ వెంకటేష్! మిత్రుడు వెంకటేష్‌పై ఉన్న స్నేహబంధాన్ని చాటి చెప్పిన ఈ అరుదైన సంఘటన సినీ వర్గాల్లో ఇప్పటికీ ఓ క్రేజీ విషయంగా చర్చనీయాంశమవుతోంది.

వెంకీ కోసం..

వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన సినిమా ‘త్రిమూర్తులు’. కె. మురళీ మోహనరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1987లో విడుదలైంది. తెలుగు సినీ చరిత్రలోనే ఇదొక ప్రత్యేకమైన మూవీగా నిలిచింది. ఎందుకంటే, ఈ సినిమాలో ఒక పాట కోసం ఇండస్ట్రీ నుంచి బిగ్ స్టార్స్ అందరూ తళుక్కున మెరిశారు. అలాంటి ఓ పాటలో బాలకృష్ణ కూడా కనిపించారు.

Balayya And Venkatesh

గెస్ట్ రోల్స్ చేయననే తన సెంటిమెంట్‌ని పక్కన పెట్టి మరీ, కేవలం వెంకటేష్‌పై ఉన్న స్నేహంతో ఈ పాటలో ఆయన మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి హీరోల సినిమాల్లోనూ ఎప్పుడూ ఆయన కనిపించలేదు. కానీ, వెంకీ కోసమే బాలకృష్ణ ఈ సాహసం చేయడం వీరిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని తెలియజేస్తుంది. మళ్లీ ఆ తర్వాత కూడా ఎప్పుడూ ఆయన ఇలా గెస్ట్‌గా కనిపించింది లేదు.

టాలీవుడ్ స్టార్స్ అంతా ఒకే ఫ్రేమ్‌లో..

బాలయ్య, వెంకటేష్‌లే కాక, ‘త్రిమూర్తులు’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా సందడి చేయడం ఈ సినిమాకు మరో ప్రత్యేకత. బాలయ్యతోపాటు చిరంజీవి, నాగార్జున, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి రెండో, మూడో తరం అగ్ర నటులు; విజయశాంతి, రాధ, భాను ప్రియ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇందులో అతిథులుగా మెరిశారు. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణమైన పరాజయం చెందడం విచారకరం.

బాలీవుడ్‌లో హిట్టైన ‘నసీబ్’ సినిమాకి ఇది తెలుగు రీమేక్ అయినప్పటికీ, ఇక్కడ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఏది ఏమైనా, తన 50 ఏళ్ల కెరీర్ సెంటిమెంట్‌ను సైతం పక్కన పెట్టి, కేవలం వెంకటేష్‌పై ఉన్న అభిమానంతో ఒక అతిథి పాత్రలో మెరిసిన బాలకృష్ణ నిర్ణయం.. పరిశ్రమలో వీరిద్దరి మధ్య ఉన్న విలువలని, స్నేహాన్ని చాటిచెబుతోంది.