బాల‌య్య‌కు గిన్నీస్ రికార్డు అందించిన అభిమానులు….

బాలయ్య అభిమానులు ఆయ‌న 60వ పుట్టిన‌రోజుకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చారు. క‌రోనా వేళ‌ ఇళ్లలో ఉంటూనే బాలకృష్ణ బ‌ర్త్ డే జ‌రిపారు అభిమానులు.

బాల‌య్య‌కు గిన్నీస్ రికార్డు అందించిన అభిమానులు....

Updated on: Jun 21, 2020 | 2:36 PM

బాలయ్య అభిమానులు ఆయ‌న 60వ పుట్టిన‌రోజుకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చారు. క‌రోనా వేళ‌ ఇళ్లలో ఉంటూనే బాలకృష్ణ బ‌ర్త్ డే జ‌రిపారు అభిమానులు. ఈనెల‌ 10న ఆయన 60వ బ‌ర్త్ డే సందర్భంగా, ఫ్యాన్స్ ఒకే సమయంలో 21 వేల కేకులు కట్​ చేసి వ‌రల్డ్ రికార్డును నెలకొల్పారు. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో, తన బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఈ ఏడాది నిరాడంబరంగా జరపాలని బాలయ్య అభిమానుల‌కు పిలుపునిచ్చారు. క‌రోనా రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించడ‌మే త‌న‌కు ఇచ్చే పెద్ద గిప్ట్ అని పేర్కొన్నారు. బాలకృష్ణ ఆదేశాల‌ను అనుస‌రించిన‌ నందమూరి ఫ్యాన్స్.. ఇంట్లోనే ఉండి, అభి‌మాన‌ కథానాయకుడి జన్మదిన వేడుకలను రికార్డు స్థాయిలో నిర్వహించారు.

జూన్​ 10న ఒకే సమయంలో (ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లు) 21 వేల కేక్​లను బాలకృష్ణ ఫ్యాన్స్ కట్​ చేశారు. ఈ వేడుకలను వ‌రల్డ్ వైడ్ వివిధ ఏరియాల్లో నిర్వహించగా.. దాదాపు 80 వేల మంది ఇందులో భాగమయ్యారు. ​ఈ వేడుకను వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, గిన్నీస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ ప్రతినిధులు పర్యవేక్షించి వ‌ర‌ల్డ్ రికార్డుగా అనౌన్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు కుదుట‌ప‌డ్డ త‌ర్వాత‌.. సంబంధిత పత్రాలను బాలకృష్ణకు స్వయంగా అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అభిమానులు వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్ స‌మ‌క్షంలో తన బ‌ర్డ్ డే వేడుకలను జరిపి వారికున్న సామాజిక బాధ్యతను నిర్వర్తించుకోవడం సహా తనకు అద్భుత‌ కానుకను ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు బాల‌య్య‌.