Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

| Edited By: Rajeev Rayala

Oct 19, 2023 | 1:22 PM

బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి. వరస విజయాలతో జోరు మీదున్న అనిల్, బాలయ్య కలిసి చేసిన సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా..? అసలు భగవంత్ కేసరి ఎలా ఉన్నాడో చూద్దాం..

Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Bhagavanth Kesari
Follow us on

మూవీ రివ్యూ: భగవంత్ కేసరి

నటీనటులు: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, ప్రియాంక జువాల్కర్, శరత్ కుమార్ తదితరులు

సంగీతం: థమన్

సినిమాటోగ్రఫీ: సి రామ్ ప్రసాద్

ఎడిటర్: తమ్మిరాజు

నిర్మాత: సాహు గురపాటి, హరీష్ పెద్ది

రచన, దర్శకుడు: అనిల్ రావిపూడి

బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి. వరస విజయాలతో జోరు మీదున్న అనిల్, బాలయ్య కలిసి చేసిన సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా..? అసలు భగవంత్ కేసరి ఎలా ఉన్నాడో చూద్దాం..

కథ:

భగవంత్ కేసరి (బాలకృష్ణ) అదిలాబాద్ జిల్లాలోని ఒక అడవిలో ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు అక్కడ జైలర్ (శరత్ కుమార్) కూతురు విజ్జి (శ్రీలీల) బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి భయపడే అమ్మాయిని కేసరి ఒక పులిలా ఎలా మార్చాడు అనేది ఈ సినిమా కథ. ఈ కథలోకి మధ్యలో రాహుల్ సంఘ్వి (అర్జున్ రాంపాల్) ఎలా వచ్చాడు.. ఆయనకు భగవంత్ కేసరికి సంబంధం ఏంటి.. మధ్యలో కాత్యాయని (కాజల్ అగర్వాల్) ఎక్కడి నుంచి వచ్చింది.. ఇవన్నీ స్క్రీన్ మీద చూడాలి..

కథనం:

అనిల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్ అన్నపుడే సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. అన్నట్లుగానే ఫుల్ కమర్షియల్ మాస్ సినిమానే అభిమానులకు అందించాడు అనిల్. ముఖ్యంగా బాలయ్యను నెవర్ బిఫోర్ కారెక్టర్‌లో చూపించాడు. ఆయన కారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్. దానిపై చాలా శ్రద్ధ పెట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. రెగ్యులర్ బాలయ్య సినిమాల కాకుండా కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేసాడు. ముఖ్యంగా డైలాగ్ డెలవరీ దగ్గర్నుంచి మొదలు పెడితే.. గెటప్ ఇలా ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు అనిల్. అందులో సక్సెస్ అయ్యాడు కూడా. ఇక కథనం విషయానికి వస్తే ఫస్టాఫ్ అంతా బాలయ్య శైలిల మధ్య ఉన్న రిలేషన్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేశాడు. దాంతో పాటు కాజల్ తో వచ్చే సన్నివేశాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత కొత్తగా ప్రయత్నించాలి. ఎప్పుడూ అదే రొటీన్ సినిమా తీస్తా అంటే ఎలా.. అనిల్ రావిపూడి కూడా ఇదే చేశాడు. కొత్తగా ట్రై చేశాడు.. మరి ఎక్స్పరిమెంట్ చేసినప్పుడు రిస్క్ కూడా ఉంటుంది కదా..? భగవంత్ కేసరి విషయంలోను ఇదే జరిగింది. రొటీన్ అనిల్ రావిపూడి బ్రాండ్ సినిమా.. బాలయ్య మార్క్ సినిమా చూద్దామని వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు.

అలా కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తే కేసరి అలరిస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే తనది కానీ గ్రౌండ్ లోకి వెళ్లి ఆట ఆడాడు అనిల్. అందులో కొన్ని బాల్స్ బౌండరీ దాటితే.. మరికొన్ని క్యాచ్ అవుట్ అయ్యాయి. సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే ఇందులో నచ్చింది ఒక్కటే.. అదే అనిల్ రావిపూడి టేకింగ్. అనుకున్నది అనుకున్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూపించాడు. కమర్షియల్ హంగులు అంటూ అనవసరంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తీశాడు. తను రాసుకున్న కథలోనే బాలయ్య ఇమేజ్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ ఓకే.. వార్నింగ్ సీన్ భాషాను గుర్తు చేస్తుంది. కొన్ని సీన్స్ భీమ్లా నాయక్ ను గుర్తు చేస్తాయి. సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఎమోషన్ పై ఫోకస్ చేశాడు అనిల్. ఆడపిల్లలను పులి పిల్లల పెంచాలి అనేది ఈ సినిమాతో అనిల్ చెప్పాలనుకున్న లైన్.

నటీనటులు:

భగవంత్ కేసరి పాత్రకు బాలయ్య పూర్తి న్యాయం చేశాడు. ఆయన పాత్ర కోసమే పుట్టాడేమో అనిపించేలా నటించాడు. బాలయ్య చెప్పినట్లుగానే ఆయన కెరీర్‌‌లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా కేసరి పాత్రలో కనిపించాడు బాలయ్య. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కాసేపు కనిపించినా ఆకట్టుకుంది. శ్రీలీల మరో కీలక పాత్రలో మెప్పించింది. బాలయ్య కూతురుగా ప్రాణం పోసింది. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా ఎమోషనల్‌గా వర్కవుట్ అయ్యాయి. సీనియర్ నటుడు శరత్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

థమన్ సంగీతం బాగుంది. ఆర్ఆర్ అయితే అదరగొట్టాడు. ఈ సినిమాతో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాడు థమన్. ముఖ్యంగా రోర్ ఆఫ్ భగవంత్ కేసరి పాట అయితే అదిరిపోయింది. కొన్ని సీన్స్‌లో అదే హైలైట్ అయింది. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకు బలం. రామ్ ప్రసాద్ చాలా సీన్స్ కెమెరా వర్క్‌తో మరింత రిచ్‌గా చూపించాడు. దర్శకుడు అనిల్ రావిపూడి రొటీన్ కథతోనే వచ్చినా.. స్క్రీన్ ప్లేతో మరోసారి మాయ చేసాడు. అక్కడక్కడా స్లో నెరేషన్ ఉంది గానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు భగవంత్ కేసరిలో చాలానే ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా భగవంత్ కేసరి.. న్యూ అటెంప్ట్.. కానీ రిస్కీ అటెంప్ట్..