స్వచ్ఛందంగా థియేటర్లకు తాళాలు వేస్తున్న యాజమాన్యం.. ఏకంగా బాహుబలి థియేటర్‌ను కూడా..

|

Dec 25, 2021 | 5:54 PM

సినిమా ఇండస్ట్రీకి.. ఏపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు ముదురుతుంది. టికెట్స్ ధరలు తగ్గించడంతో  స్వచ్చందంగా థియేటర్స్ ను మూసివేస్తున్నారు యజమానులు.

స్వచ్ఛందంగా థియేటర్లకు తాళాలు వేస్తున్న యాజమాన్యం.. ఏకంగా బాహుబలి థియేటర్‌ను కూడా..
Follow us on

సినిమా ఇండస్ట్రీకి.. ఏపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు ముదురుతుంది. టికెట్స్ ధరలు తగ్గించడంతో  స్వచ్చందంగా థియేటర్స్ ను మూసివేస్తున్నారు యజమానులు. తాజాగా ఏపీలో బాహుబలి థియేటర్ మూతపడింది. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలోని V-EPIQ మల్టీప్లెక్స్ థియేటర్ క్లోజ్ అయ్యింది. తగ్గిన టికెట్ ధరలతో థియేటర్లను నడపలేము అంటూ సినిమా హాల్ కి మూతేసింది యాజమాన్యం. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ గా V-EPIQ మల్టీ ప్లెక్స్ కి పేరుంది. బాహుబలి థియేటర్ గానూ దీన్ని పిలుస్తారు. ప్రస్తుతం ఇందులో నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీ ఆడుతోంది.

అయితే టికెట్ రేట్లు భారీగా తగ్గడంతో చేసేదేమీ లేక థియేటర్ ను మూసేసింది యాజమాన్యం. దీంతో సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సూళ్లూరు పేట జాతీయ రహదారిపై వి-ఎపిక్‌ థియేటర్‌ ఉంది. దీన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్‌ ధరలతో థియేటర్లు నడపలేమని వాటి యజమానులు వాపోతున్నారు. స్వచ్ఛందంగా థియేటర్లకు తాళాలు వేస్తున్నారు. సినిమా టికెట్లపై ప్రభుత్వ వైఖరి, థియేటర్లలో అధికారుల తనిఖీలను నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల స్వచ్చంధంగా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు.  తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సినిమా హాళ్ల బయట బోర్డులు పెడుతున్నారు.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఏమన్నారంటే..

హీరోగా మారనున్న కాంగ్రెస్ కీలక నేత.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరంటే…

Ghani: గని రిలీజ్ డేట్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ సినిమా విడుదల ఎప్పుడంటే..