Baby Movie: శ్రీవారిని దర్శించుకున్న ‘బేబీ’ టీమ్‌.. సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావడంతో..

|

Jul 23, 2023 | 4:50 PM

బేబీ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం స్వామివారి నైవేద్య విరామసమయంలో హీరోలు ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య, నిర్మాత శ్రీనివాసకుమార్‌, దర్శకుడు సాయి రాజేష్‌ ఏడుకొండల స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Baby Movie: శ్రీవారిని దర్శించుకున్న బేబీ టీమ్‌.. సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావడంతో..
Baby Movie
Follow us on

బేబీ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం స్వామివారి నైవేద్య విరామసమయంలో హీరోలు ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య, నిర్మాత శ్రీనివాసకుమార్‌, దర్శకుడు సాయి రాజేష్‌ ఏడుకొండల స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బేబీ యూనిట్‌కు ఆలయ పండితులు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందజేశారు. అలాగే ఆలయాధికారులు పట్ట వస్త్రాలతో పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా బేబీ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ టూర్లు నిర్వహిస్తోంది చిత్రబృందం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవితో పాటు పలువరు మూవీ యూనిట్‌ సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని ఓ థియేటర్‌లో బేబీ సినిమాను వీక్షించారు. అనంతరం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం బేబీ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి.

మరోవైపు బాక్సాఫీస్‌ వద్ద బేబీ కలెక్షన్ల ఊచకోత కొనసాగుతోంది. విడుదైనప్పటినుంచి ఇప్పటివరకు (9 రోజుల్లో) 60.3 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాత శ్రీనివాసకుమార్‌ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాగా పవన్‌ కల్యాణ్‌ బ్రో రిలీజయ్యేంతవరకు బేబీ కలెక్షన్లకు ఢోకా లేదన ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే 5 రోజుల్లో బేబీ మరిన్ని రికార్డులు కొల్లగొట్టవచ్చంటున్నారు. మరోవైపు కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ బేబీ సెలబ్రేషన్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ టూర్లు ప్లాన్‌ చేసింది మూవీ యూనిట్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.