
ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా బేబీ. స్టార్ హీరోహీరోయిన్ కాకుండా అప్ కమింగ్ తారలతో రూపొందించిన ఈ ట్రైయాంగిల్ లవ్ ఫెయిల్యూర్ సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు డైరెక్టర్ సాయి రాజేష్. అంతకు ముందు హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి పేరడీ చిత్రాలతోపాటు.. కలర్ ఫోటో వంటి ఎమోషనల్ లవ్ స్టోరీకి స్క్రిప్ట్ అందించి రచయితగా.. దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ బేబీ సినిమాకు దర్శకుడిగా మరింత ఫేమస్ అయ్యారు. చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది ఈ చిత్రం. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా డైరెక్టర్ సాయి రాజేష్ ఇన్ స్టాలో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇండస్ట్రీలోకి రాకముందు మీరు ఏం చేసేవారు ?.. అంటూ ఓ అభిమాని సాయి రాజేశ్‌ను ప్రశ్నించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘ నా చదువు, లైఫ్, కెరీర్ పోయినా సరే టాలీవుడ్ బాగుండాలని ఫ్యాన్స్ వార్స్ చేసేవాడిని’ అంటూ సమాధానమిచ్చారు. ఆ తర్వాత ట్విట్టర్ కు రెస్ట్ ఇచ్చారా అన్నా ?..’ అని మరో అభిమాని అడగ్గా.. మూడు నెలలు లాగిన్ కాలేదని వాడే ఐడి తీసేశాడు అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం సాయి రాజేష్ ఆన్సర్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
సాయి రాజేష్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఇక బేబీ సినిమా హిట్ కావడంతో ఈ మూవీ టీంను స్వయంగా మెగాస్టార్ ఇంటికి పిలిచి అభినందించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
Sai Rajesh
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.