Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై అభిమానాన్ని చాటుకున్న ‘బేబీ’ డైరెక్టర్‌.. జనసేన పార్టీకి భారీ విరాళం

బేబీ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌ పవన్‌ కల్యాణ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. పవర్‌ స్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీకి రూ.2 లక్షల విరాళం అందించారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు. జనసేన అధినేత ఫొటోతో, విరాళం ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సాయి రాజేష్‌.. 'ఆ స్పందించే మనసుకి , ఎదిరించే ధైర్యానికి, పోరాడే తత్వానికి ఎప్పటికీ అభిమానిని...

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై అభిమానాన్ని చాటుకున్న బేబీ డైరెక్టర్‌.. జనసేన పార్టీకి భారీ విరాళం
Sai Rajesh, Pawan Kalyan

Updated on: Sep 06, 2023 | 9:46 AM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామన్యులే కాదు సినిమా ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు సైతం పవర్‌స్టార్‌ను అభిమానిస్తారు. తాజాగా బేబీ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌ పవన్‌ కల్యాణ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. పవర్‌ స్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీకి రూ.2 లక్షల విరాళం అందించారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు. జనసేన అధినేత ఫొటోతో, విరాళం ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సాయి రాజేష్‌.. ‘ఆ స్పందించే మనసుకి , ఎదిరించే ధైర్యానికి, పోరాడే తత్వానికి ఎప్పటికీ అభిమానిని. మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు, ఆనవాయితిగా రెండు లక్షల రూపాయిలు జనసేన పార్టీ కి ఆయన పుట్టిన రోజు సందర్భంగా సాయంగా అందిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ డైరెక్టర్‌ సాయి రాజేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బేబీ డైరెక్టర్‌ ఇలా ఆర్థిక సాయం చేయడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో ఓ పన్‌ అభిమాని ఆపదలో ఉంటే ఏకంగా రూ.50,000 సాయం చేశారు.

‘బేబీ’ సినిమాతో ఒక్కసారిగా  క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు సాయి రాజేష్‌. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫీల్‌ గుడ్‌ మూవీ టాలీవుడ్‌లో సెన్సేషన్‌ సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 14న విడుదలైన బేబీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఏకంగా రూ. 90 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రిలీజై రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కాగా గతంలో కొబ్బరి మట్ట, హృదయ కాలేయం సినిమాలకు దర్శకత్వం వహించారు సాయి రాజేష్‌. అలాగే జాతీయ పురస్కారం అందుకున్న కలర్‌ ఫొటోకు రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఇక తన తర్వాతి ప్రాజెక్టు కూడా ఎస్‌కేఎన్‌ నిర్మాణ సంస్థలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక యంగ్ హీరోతో సినిమాను ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ సాయి రాజేష్  షేర్ చేసిన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..