పృథ్వీరాజ్.. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు టాలీవుడ్ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా పృథ్వీరాజ్ తమిళ్ సినిమాల్లో ఎక్కువగా నటించి మెప్పించాడు. తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోను నటించి అలరించాడు. వడ్డె నవీన్ హీరోగా వచ్చిన పెళ్లి సినిమాలో సైకో భర్త పాత్రలో పృథ్వీరాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించాడు. ఇటీవల విడుదలైన బోయపాటి, రామ్ స్కంద సినిమాలోనూ నటించాడు. అలాగే రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలో కనిపించాడు. ఇదిలా ఉంటే సినిమాలతో కంటే వివాదాలతో పృథ్వీరాజ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
పృథ్వీరాజ్ ఇటీవలే తన కన్నా దాదాపు 30 ఏళ్లు చిన్నదైన యువతిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. వీరి వివాహం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. 1994 లో బీనా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు పృథ్వీరాజ్. ఆతర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆతర్వాత కొంతకాలం వంటరిగా ఉన్న పృథ్వీరాజ్ ఇటీవలే రుక్మిణి శీతల్ అనే తెలుగు యువతితో ప్రేమలో పడ్డాడు.
చాలా కాలం డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం పై చాల వార్తలు, విమర్శలు వచ్చినప్పటికీ ఇద్దరు పెద్దగా స్పందించకుండా దైర్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు విడిపోతున్నారని తెలుస్తోంది. శీతల్ , పృథ్వీరాజ్ ఎక్కువ కాలం నిలవలేదు. ఏడాది కూడా గడవకుండా విడాకులు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. శీతల్ తాజాగా పృథ్వీరాజ్ తనకు ప్రపోజ్ చేసిన వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పృథ్వీరాజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. యానిమల్ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో పృథ్వీరాజ్ కు ఆఫర్స్ పెరిగే ఛాన్స్ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.