Shobu Yarlagadda: మంత్రి బొత్స MRP ధరల కామెంట్స్‌పై బాహుబలి ప్రొడ్యూసర్ సంచలన ట్వీట్

|

Dec 23, 2021 | 7:54 PM

సినిమా ఆటపై పరిశ్రమలో తలోమాట వినిపిస్తోంది. టికెట్ల రేట్ల తగ్గింపుపై ఎవరికి నచ్చినట్టు వాళ్లు పబ్లిక్‌గా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మాత్రం సామాన్యుడికి వినోదం అన్న ఫార్మూలాను ఫాలో అవుతుంది.

Shobu Yarlagadda: మంత్రి బొత్స MRP ధరల కామెంట్స్‌పై బాహుబలి ప్రొడ్యూసర్ సంచలన ట్వీట్
Shobu Yarlgadda
Follow us on

సినిమా ఆటపై పరిశ్రమలో తలోమాట వినిపిస్తోంది. టికెట్ల రేట్ల తగ్గింపుపై ఎవరికి నచ్చినట్టు వాళ్లు పబ్లిక్‌గా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మాత్రం సామాన్యుడికి వినోదం అన్న ఫార్మూలాను ఫాలో అవుతుంది. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంతో పాటు ఏరియాలకు అనుగుణంగా థియేటర్ టికెట్ రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రూల్స్ పాటించని థియేటర్లపైన చర్యలు కూడా తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై ఇండస్ట్రీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కిరాణా కొట్టు కంటే థియేటర్ కౌంటర్లో కలెక్షన్ తక్కువగా ఉంటే ఇండస్ట్రీ బతికేదెలా అన్నది నాని పాయింట్‌. అయితే ప్రతి దానికీ ఎమ్మార్పీ ఉంటుంది.. అందుకే టికెట్లకి కూడా లిమిట్స్ పెట్టామన్నది ప్రభుత్వ వాదన. ఇదే విషయాన్ని విపులంగా తెలిపారు మంత్రి బొత్స.

“సినిమా టికెట్లు విక్రయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎవరికైనా, ఏమైనా ఇబ్బందులు ఉంటే, వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకోవాలి. అలా కాకుండా, మా ఇష్టారాజ్యంగా చేసుకుంటామంటే కుదరదు. ఎంఆర్పీ అనేది ఈరోజు ప్రతి వస్తువుకీ ఉంటుంది. ఎంఆర్పీ లేకుండా భారతదేశంలో ఏ వస్తువు అయినా అమ్ముతున్నామా..? దేనికైనా ఎంఆర్పీ అన్నది ఉండాలి, అలాంటిది సినిమా టికెట్లకు ఉండకూడదా..? ఇదెక్కడి న్యాయం…?” అని ప్రశ్నించారు బొత్స.

ఇక్కడే జస్ట్ చెబుతున్నా అంటూ తన మార్క్ కౌంటర్ వేశారు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ. నిత్యావసర వస్తువులకు తప్ప మిగిలిన వస్తువులకు గరిష్ట చిల్లర ధర నిర్ణయించుకునే అధికారం నిర్మాతలకు, తయారీదారులకు ఉంటుంది, ప్రభుత్వానికి కాదు అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఆయన నానికి మద్దుతుగా వేశారన్నది స్పష్టమవుతోంది.

హీరో పవన్ కల్యాణ్‌, ట్రిపులార్‌ నిర్మాత దానయ్య కూడా టికెటింగ్‌ విధానంపై వేర్వేరు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా నష్టాల్లోకి వెళ్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నష్టాలు తప్పవని సినీ ప్రముఖులు అంటుంటే.. ఇష్టారీతిన అమ్ముకుంటారా.. అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.

హైకోర్టులో జీవో నెంబర్ 35కి సంబంధించి విచారణ మళ్లీ వాయిదా పడింది. మరోవైపు సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్ సినిమాలు తెరమీదకు రాబోతున్నాయి. మరి.. మల్టిపుల్ స్ర్కీన్ ప్లే కి క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది? ఎప్పుడు ఎలా ఎండ్‌కార్డ్ పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత

జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!