Child Artist : హీరోగా మారిన బాహుబలి చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేలా ఉన్నాడో చూశారా.. ?

ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన ఆకట్టుకున్న బాలనటులు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే కావ్య కళ్యాణ్ రామ్, తేజ సజ్జా, శ్రీవిధ్య వంటి స్టార్స్ గా విజయాలను అందుకున్నారు.. ఇక ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

Child Artist : హీరోగా మారిన బాహుబలి చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేలా ఉన్నాడో చూశారా.. ?
Satvik Varma

Updated on: Jul 02, 2025 | 7:17 AM

సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టులుగా మెప్పించిన చిన్నారులు ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఒకప్పుడు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించిన బాలనటీనటులు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నారు. ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన తేజ సజ్జా.. ఇప్పుడు హానుమాన్ సినిమాతో హీరోగా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్టు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అతడే సాత్విక్ వర్మ. తెలుగులో బాహుబలి సినిమాతోపాటు పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించాడు. ఆ తర్వాత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సాత్విక్.. ఇప్పుడు సరికొత్త ప్రేమకథతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. వరలక్ష్మీ పప్పుల సమర్పణలో.. కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ప్రేమిస్తున్నా. ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తెలుగమ్మాయి ప్రీతి నేహా కథానాయికగా వెండితెరకు పరిచయం కాబోతుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మొదటి పాటను చిత్రయూనిట్ ఘనంగా విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు భీమ్స్, దర్శకులు అశోక్.జి, అనుదీప్ కే.వి, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ వంటి సినీప్రముఖులు హాజరై మూవీటీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరోగా వెండితెరపై సందడి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సాత్విక్ వర్మ బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బాహుబలి, రేసుగుర్రం, మళ్లీ రావా, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించారు. ఇప్పటికే బ్యాచ్ అనే సినిమాతో హీరోగా అలరించాడు సాత్విక్. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక డిఫరెంట్ పాయింట్‍తో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత కనకదుర్గారావు తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..