Pawan Rana Movie: పవన్‌ పుట్టిన రోజు కోసం సర్‌ప్రైజ్‌ సిద్ధం చేస్తున్న మేకర్స్‌.. పవన్‌ – రానాల చిత్రానికి సంబంధించి..

Pawan Rana Movie: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని సంబురం వస్తుంది. తమ అభిమాన హీరో పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఫ్యాన్స్‌...

Pawan Rana Movie: పవన్‌ పుట్టిన రోజు కోసం సర్‌ప్రైజ్‌ సిద్ధం చేస్తున్న మేకర్స్‌.. పవన్‌ - రానాల చిత్రానికి సంబంధించి..
Pawan Klyan Birthday

Updated on: Aug 09, 2021 | 9:11 AM

Pawan Rana Movie: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని సంబురం వస్తుంది. తమ అభిమాన హీరో పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఫ్యాన్స్‌ తహతహలాడుతుంటారు. ఇక మూవీ మేకర్స్‌ కూడా పవన్‌ పుట్టిన రోజున ఏదో ఒక అప్‌డేట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా అలాంటి సర్‌ప్రైజ్‌నే ప్లాన్‌ చేస్తోంది చిత్ర యూనిట్‌. పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్‌ కోషియం సినిమా రీమేక్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. మలయాళంలో సంచలన విజయం అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. మల్టీస్టారర్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్‌తో పాటు రానా కూడా నటిస్తున్నారు. టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌ మూవీగా వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ మాట సాయం చేస్తుండడంతో మరింత క్రేజ్‌ ఏర్పడింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాలో పవన్‌, రానా ఫస్ట్‌ లుక్‌లను చిత్ర యూనిట్‌ పంచుకుంది. ఇక పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా (సెప్టెంబర్‌ 2) చిత్ర యూనిట్‌ ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమాలో నిత్యమీనన్‌తో పాటు ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. నిత్య పవన్‌కు భార్యగా నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి పవన్‌ హీరోగా నటిస్తోన్న ఇతర చిత్రాల మేకర్స్‌ ఆయన పుట్టిన రోజుకు ఎలాంటి గిఫ్ట్‌ ఇవ్వనున్నారో చూడాలి.

Also Read: Karthika Deepam: మీ అమ్మనూ చంపేస్తాను..నిస్సిగ్గుగా నిజాలు కక్కిన మోనిత..నిజాలు విని కార్తీక్ షాక్..!

Anupam Shyam: బాలీవుడ్‌‌‌లో విషాదం.. అనారోగ్యంతో ప్రముఖ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ కన్నుమూత.. పలువురి సంతాపం

Casting Couch: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే వారికి అలా కనిపించాల్సిందే… సంచలన కామెంట్స్ చేసిన అందాల తార.