పీరియడ్స్‌ పెయిన్‌ తోనే హీరోయిన్ డ్యాన్స్.. కట్ చేస్తే ఈ సాంగ్‌కు యూట్యూబ్ షేక్.. ఏకంగా 250 మిలియన్ల వ్యూస్‌తో..

సుమారు రెండు నెలల క్రితం ఈ సాంగ్ యూట్యూబ్ లోకి వచ్చింది. మూవీ లవర్స్ ను అమితంగా ఆకట్టుకున్న ఈ సాంగ్ ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. ఈ సాంగ్ వ్యూస్ ఇప్పటికే 250 మిలియన్ల కు చేరువలో ఉంది.

పీరియడ్స్‌ పెయిన్‌ తోనే హీరోయిన్ డ్యాన్స్.. కట్ చేస్తే ఈ సాంగ్‌కు యూట్యూబ్ షేక్.. ఏకంగా 250 మిలియన్ల వ్యూస్‌తో..
Shararat Song From Dhurandhar Movie

Updated on: Feb 12, 2026 | 7:01 PM

సినిమా హిట్ కావాలంటే సంగీతం కూడా ముఖ్యమే. సాంగ్స్ హిట్ అయితే ఆటోమెటిక్ గా సినిమాకు పాజిటివ్ బజ్ వస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు తమ సినిమాల్లోని పాటల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆడియెన్స్ తో పాటు నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా సాంగ్స్ ను డిజైన్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ ల హవా నడుస్తోంది. సినిమా విజయాల్లో ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతకు మించి ఈ సాంగ్స్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా స్టార్ హీరోయిన్లు సైతం ఇలాంటి ప్రత్యేక పాటల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా రెండు నెలల క్రితం రిలీజైన ఓ మూవీ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సాంగ్ వ్యూస్ ప్పటికే 250 మిలియన్ల కు చేరువలో ఉంది. మరి ఇంతకీ ఆ సాంగ్ ఏదనుకుంటున్నారా?

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసిన సినిమా ధురంధర్. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులో చాలా మంది స్టార్స్ నటించారు. సారా అర్జున్ హీరోయిన్ గా నటించగా అక్షయ్ ఖన్నా, అర్జున్ రామ్ పాల్, మాధవన్, సంజయ్ దత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఒక సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్ గా నిలిచింది. అదే ఆయేషా ఖాన్ చేసిన స్పెషల్ సాంగ్ షరారత్. ఇందులో తన డ్యాన్స్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది ఆయేషా. ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ షరారత్ సాంగ్ కోసం తాను పడిన కష్టాన్ని అందరితో పంచుకుంది. ‘

‘ఈ సాంగ్ షూట్ సమయంలో నేను పీరియడ్స్ తో ఉన్నా. చాలా అసౌకర్యంగా అనిపించింది. కానీ నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా. టైమ్ తక్కువ ఉండటంతో సాంగ్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనుకున్నారు. కానీ నేను చాలా అలసిపోయా. అయినా డ్యాన్స్ చేశా. ఎముకలు చాలా నొప్పి కలిగించాయి. పీరియడ్స్ లో ఉన్నా కాబట్టి మరింత నొప్పి కలిగింది. కొన్ని సందర్భాల్లో ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఏడ్చేశాను. బాధను తట్టుకున్నా. అయితే చివరికీ సాంగ్ బాగా రావడంతో ఈ బాధనంతా మర్చిపోయాను’ అని అంటోంది ఆయేషా. ఈ పాటను శాశ్వత్ సచ్ దేవ్ స్వరపరిచారు. మధుబంతి బాగ్చి, జాస్మిన్ శాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. యూట్యూబ్ లో షరారత్ ఇప్పటికే 250 మిలియన్ల వ్యూస్ కు చేరువలో ఉంది.

ఇవి కూడా చదవండి

ధురంధర్ మూవీ స్పెషల్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.