Saif Ali Khan: సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంత ఇచ్చారంటే?

|

Jan 21, 2025 | 10:21 AM

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రాణాలను కాపాడడంలో ఓ ఆటో డ్రైవర్ కీలక పాత్ర పోషించాడు. అర్ధరాత్రి సమయంలో వీలైనన్ని షార్ట్ కట్స్ తీసుకుని నటుడిని సకాలంలో ఆస్పత్రికి చేర్చాడు. దీంతో ఈ ఆటో డ్రైవర్ ను ఘనంగా సన్మానించి రివార్డ్ అందజేశారు.

Saif Ali Khan: సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంత ఇచ్చారంటే?
Saif Ali Khan
Follow us on

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి వారం రోజులు కావస్తోంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ను సదరు వ్యక్తి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. కాగా ఈ ఘటనలో సైఫ్‌ అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించేందుకు ఓ ఆటో డ్రైవర్‌ సాయం చేశాడు. సకాలంలో సైఫ్‌ను సేఫ్ గా ఆస్పత్రికి చేర్చి నటుడి ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడీ ఆటో డ్రైవర్‌కు రివార్డు లభించింది. సైఫ్ అలీఖాన్‌పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో సైఫ్ కుటుంబ సభ్యులు ఓ ఆటో డ్రైవర్ సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.అతను షార్ట్ కట్స్ వెతుక్కుంటూ సైఫ్ ను లీలావతి ఆస్పత్రికి చేర్చాడు. తద్వారా నటుడికి సకాలంలో చికిత్స అందేలా చేశాడు. ఇలా సైఫ్ ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించిన ఆ ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్. తాజాగా ఈ ఆటో డ్రైవర్ కు ముంబయిలోని ఓ సంస్థ 11 వేల రూపాయల రివార్డు ఇచ్చి సత్కరించింది.

సైఫ్ అలీఖాన్‌ దాడి కేసులో భాగంగా ఈ ఆటో డ్రైవర్‌ను కూడా పోలీసులు పిలిపించి విచారించారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనపై తన వివరణ ఇచ్చాడు భజన్ సింగ్. ‘ఆ వ్యక్తి వీపు బాగా రక్తసిక్తమైంది. అతను సైఫ్ అలీఖాన్ అని కూడా నాకు తెలియదు. ఎవరో తీవ్రంగా గాయపడ్డారని అనుకున్నాను. రిక్షా దిగి లీలావతి హాస్పిటల్ లోకి తీసుకెళుతుండగా అతని ముఖం చూశాను. అప్పుడు తెలిసింది సైఫ్ అని. ఎవరైనా నేను వీలైనంత వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. వీలైనన్ని షార్ట్ కట్స్ తీసుకుని మనిషిని హాస్పిటల్ కి చేర్చడమే నా లక్ష్యం. నేను అలానే చేసాను. సైఫ్ అలీఖాన్ ఆ రోజు తెల్లటి దుస్తులు ధరించాడు. అతని సహాయకుడు, కుమారుడు తైమూర్ మాత్రమే సైఫ్ తో ఉన్నారు’అని భజన్ సింగ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.