మా నాన్న వల్లే నాకు అవకాశాలు రావడం లేదు..! లేకపోతే.. టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీలో వారసులకు కొదవే లేదు.. ఎంతో మంది నట వారసులు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కొందరు వరుస సినిమాలు, సక్సెస్ లతో దూసుకుపోతుంటే మరికొంతమంది మాత్రం అవకాశాలు అందుకోలేక వెనకబడుతున్నారు. తాజాగా ఓ హీరో తన తండ్రి వల్లే అవకాశాలు రావడం లేదు అని చెప్పి షాక్ ఇచ్చాడు.

మా నాన్న వల్లే నాకు అవకాశాలు రావడం లేదు..! లేకపోతే.. టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్
Tollywood Hero

Updated on: Jan 27, 2026 | 8:25 AM

సినిమా ఇండస్ట్రీలో చాలా స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొందరు హీరోయిన్స్ గా , హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. వరుసగా సినిమాలు చేసినా కూడా హిట్స్ పడక చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పెద్ద పెద్ద సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే తాజాగా ఓ హీరో తన తండ్రి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయన కొడుకుని కాకపోయి ఉంటే నాకు ఎక్కువ అవకాశాలు వచ్చేవి అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? అందుకు ఆయన ఆ కామెంట్స్ ఎందుకు చేశారో తెలుసుకుందాం.!!

చంద్రహాస్.. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవొచ్చు కానీ యాటిట్యూడ్ స్టార్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ప్రముఖ టెలివిజన్ నటుడు ప్రభాకర్‌ కొడుకు చంద్రహాస్. ప్రభాకర్ చాలా సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే పలు సినిమాల్లోనూ నటించారు ప్రభాకర్. ఇటీవలే ఆయన కొడుకు చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ముందు సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. గతంలో చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు బారాబర్ ప్రేమిస్తా అనే సినిమాతో మరో సారి ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. కాగా తాజాగా చంద్రహాస్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను నటుడు ప్రభాకర్ కొడుకు కాకపోయి ఉంటే నాకు ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వచ్చేవని చెప్పి షాక్ ఇచ్చాడు.. కేవలం ప్రభాకర్ కొడుకు అవ్వడం వల్లే ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కేవలం ప్రభాకర్ కొడుకు కావటం వల్లే తన కెరియర్ ఇలా ఉందని చంద్రహాస్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక బారాబర్ ప్రేమిస్తా సినిమా ఫిబ్రవరి 6వ తేదీ విడుదలకానుంది. మరి ఈ సినిమాతో చంద్రహాస్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..