Pawan Kalyan: ‘నా దేవుడి సినిమాను నేనెందుకు అడ్డుకుంటాను’.. దిల్ రాజుపై జనసేన బహిష్కృత నేత సంచలన ఆరోపణలు

థియేటర్ల బంద్ విషయంలో కుట్ర పన్నారంటూ జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ అలియాస్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ బుధవారం (మే28) మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై సంచలన ఆరోపణలు చేశారు.

Pawan Kalyan: నా దేవుడి సినిమాను నేనెందుకు అడ్డుకుంటాను.. దిల్ రాజుపై జనసేన బహిష్కృత నేత సంచలన ఆరోపణలు
Atti Satyanarayana, Dil Raju

Updated on: May 28, 2025 | 2:30 PM

ఆంధ్రప్రదేశ్‌ థియేటర్ల బంద్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్ల బంద్ పై సంచలన కామెంట్స్ చేశారు. దీని వెనక జనసేన ప్రముఖ నేత, రాజమండ్రి నగర ఇంఛార్జి, అనుశ్రీ ఫిల్మ్స్ అధినేత అత్తి సత్యనారాయణ ఉన్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీంతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సత్యనారాయణ‌ను పార్టీ నుంచి డిస్మిస్ చేశారు. అదేవిధంగా సత్య నారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. తాజాగా దీనిపై స్పందించారు అత్తి సత్యనారాయణ. బుధవారం (మే28) మీడియా ముందుకు వచ్చిన ఆయన దిల్ రాజుపై సంచలన ఆరోపణలు చేశారు.

‘థియేటర్ల బంద్ విషయంలో దురుద్దేశంతోనే దిల్ రాజు నా పేరు చెప్పారు. పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారు. ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకునేందుకు దిల్ రాజు నా పేరు చెప్పారు. నేను థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదు. ఒక జర్నలిస్టు అడిగిన దానికి సినిమాలు లేక థియేటర్లు మూసి వేయాల్సి వస్తుందనీ అన్నాను. జూన్ 1న థియేటర్ల బంద్ చేయిస్తామని దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి తొడగొట్టి చెప్పారు. ఇప్పుడు ఆయన తమ్ముడుని కాపాడుకోవడానికి దిల్ రాజు నాపై అభాండం వేశారు. దిల్ రాజు ఆస్కార్ నటుడి రేంజ్ లో నటించారు. కమల్ హాసన్ ను మించి యాక్ట్ చేస్తున్నారు. నా దేవుడు పవన్ కళ్యాణ్ సినిమాను నేను ఎందుకు అడ్డుకుంటాను. దిల్ రాజు నైజాం నవాబులా ఏలుదాము అని అనుకుంటున్నాడు.త్వరలోనే నిజ నిజాలు తెలుస్తాయి’ అని

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .