
దాదాపు 1200 సినిమాల్లో కమెడియన్ గా హీరోగా నటించి మెప్పించిన ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే మనదగ్గర టక్కున చెప్పే పేరు అలీ. ఆయన కామెడీ టైమింగ్ కు, ఆయన నటనకు ప్రేక్షకులంతా ఫిదా అవుతారు. అలీ ఉన్నాడంటే సినిమాలో కామెడీ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని అందరు అంటుంటారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అలీ హీరోగానూ పలు సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ఆయన నటించిన యమలీల సినిమా గురించి చెప్పుకోవాలి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అలీ హీరోగా నటించగా ఇంద్రజా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అలీకి మంచి పేరు వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయం తెలిపారు.
ముందుగా ఈ సినిమాలో సౌందర్యను హీరోయిన్ గా అనుకున్నారట. అయితే అప్పటికే సౌందర్య పెద్ద హీరోయిన్ అయ్యింది. వరుస సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోలకు జోడీగా చేస్తున్న సమాయంలో అలీ తో నటించడానికి ఆమె ఆసక్తి చూపలేదట.
కృష్ణారెడ్డి ఇంతా ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదట. సౌందర్య తన ఆఫర్ ను మర్యాద పూర్వకంగానే తిరస్కరించిందని తెలిపారు. అయితే ఆ తర్వాత ఇంద్రజాను సెలక్ట్ చేశారట. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ గా నిలిచింది. ఆ సమయంలో సౌందర్యా చాలా బాదపడిందట. అలీ పక్కన నటించలేక పోయినందుకు చాలా రోజులు భాదపడిందట. ఆ విషయాన్నీ సౌందర్య తండ్రి కృష్ణారెడ్డి కి చెప్పారట. దాంతో ఆమెతో శుభలగ్నం సినిమాలో అలీతో కలిపి చినుకు చినుకు అందెలతో పాటలో చూపించారట కృష్ణారెడ్డి. సౌందర్య నాకు సొంత చెల్లెలు లాంటిది. ఎంత స్టార్ అయినా ఆమెలో గర్వం అసలు ఉండేది కాదు అన్నారు. ఆమె ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకునేవాడిని అని తెలిపారు.