Venu Swamy: ‘ఆ సూపర్ హిట్ సినిమా నా బయోపిక్కే’.. స్టార్ హీరో మూవీపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

సెలబ్రిటీల జాతకాలు చెప్పడమే కాదు తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అలా ఓ స్టార్ హీరో నటించిన సూపర్ హిట్ సినిమా గురించి గతంలో వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Venu Swamy: ఆ సూపర్ హిట్ సినిమా నా బయోపిక్కే.. స్టార్ హీరో మూవీపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
Astrologer Venu Swamy

Updated on: Jan 15, 2026 | 11:24 AM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. అలాగే చిత్ర విచిత్రమైన పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. సామాన్యులే కాదు రష్మిక మందన్నా, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, పూర్ణ, ప్రగతి తదితరులు వివిధ సందర్భాల్లో వేణు స్వామి తో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఇక గతంలో పలు సూపర్ హిట్ సినిమాలకు పూజా కార్యక్రమాలు చేయించారు వేణు స్వామి. స్టార్ హీరోల సినిమాలకు కొబ్బరి కాయలు కొట్టి ఓపెనింగ్ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఓ స్టార్ హీరో సినిమా గురించి మాట్లాడిన అది తన బయోపిక్కే నంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ సూపర్ హిట్ సినిమా ఏది? అనుకుంటున్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు వివి వినాయక్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘అదుర్స్’. 2010లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ పాత్రల్లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ‘చారి’ పాత్రలో ఎన్టీఆర్ తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అలాగే నయనతార, షీలా, బ్రహ్మానందం తదతరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అయితే ఈ అదుర్స్ సినిమా తన బయోపిక్ అని.. ఇందులో ఎన్టీఆర్ నటించిన రెండు పాత్రలు తనవేనంటున్నారు వేణు స్వామి. ‘నేను ఎన్టీఆర్ అదుర్స్ సినిమా పూజా కార్యక్రమానికి వెళ్లాను. అప్పుడు ఎన్టీఆర్ కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. దీంతో అప్పుడే ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేనే ఎన్టీఆర్ తో చెప్పాను. అనుకున్నట్లు సినిమా సూపర్ హిట్ అయ్యింది’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు వేణు స్వామి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల వార్ 2తో మెప్పించారు యంగ్ టైగర్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.