Vijay Devarakonda – Virat Kohli: విరాట్ కోహ్లి బయోపిక్‌లో ‘రౌడీ’.. మనసులో మాట బయటపెట్టిన లైగర్ హీరో..
Asia Cup 2022: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో విజయ్ దేవరకొండ సందడి చేశాడు. మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన షాట్‌పై అతని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
India vs Pakistan: లైగర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సౌత్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు దుబాయ్ చేరుకోవడం ద్వారా పలు వార్తల్లో నిలిచాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి దేవరకొండ వీరాభిమాని. అతని జీవితం ఆధారంగా బయోపిక్ తీయాలని ఆకాంక్షిస్తున్నాడు. స్టార్ స్పోర్ట్స్ షో సందర్భంగా, విరాట్ కోహ్లీ బయోపిక్ తీయాలనుకుంటున్నట్లు దేవరకొండ చెప్పుకొచ్చాడు.
అర్జున్ రెడ్డి లాంటి హిట్ మూవీని అందించిన విజయ్ దేవరకొండను షో సందర్భంగా ఏ భారతీయ క్రికెటర్ బయోపిక్ తీయాలనుకుంటున్నారని అడిగారు. దీనికి ఆయన మాట్లాడుతూ “ధోనీ భాయ్ బయోపిక్‌ని ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీశారు. కాబట్టి ఇప్పుడు నేను విరాట్ అన్న బయోపిక్ చేయాలనుకుంటున్నాను అని తెలిపాడు.
Arjun Reddy star @TheDeverakonda has expressed his desire to do a biopic on @imVkohli
When he was asked on whom would you like to make a biopic, he replied, “Dhoni bhai biopic already did by Sushant so I’m interested to do Virat anna biopic”#VijayDeverakonda #Viratkohli #Liger pic.twitter.com/M5y38ULEys
— FilmiFever (@FilmiFever) August 28, 2022
విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 100వ టీ20 ఇంటర్నేషనల్‌ను పాకిస్థాన్‌తో ఆడాడు. భారత్ నుంచి అన్ని ఫార్మాట్లలో 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో అతని కంటే ముందు, న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టేలర్ మాత్రమే ఈ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మ్యాచ్‌కి ముందు స్టార్ స్పోర్ట్స్ షో సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఈ ప్రత్యేక మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ కనీసం 50 పరుగులు చేయాలని కోరుకున్నాడు.