‘పుష్ప’ సినిమాలోని అద్భుత నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీంతో ఈ స్టార్ హీరోకి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మొదలు కుని సామాన్యుల వరకు అల్లు అర్జున్‌కు విషెస్ చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే బన్నీ పేరు మార్మోగిపోతోంది. 69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల మొదటిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉందంటూ ఐకాన్ స్టార్ అభిమానులు, నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక దివ్యాంగురాలు మాత్రం బన్నీకి వినూత్నంగా విషెస్ తెలిపింది. రెండు చేతులు లేకపోయినా నోటితో అల్లు అర్జున్ చిత్ర పటం గీసి అతనికి అభినందనలు తెలిపింది. పుష్ప మూవీలోని అల్లు అర్జున్ గెటప్‌ను నోటితో గీసింది. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను ట్వి్ట్టర్‌లో షేర్ చేయగా అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దివ్యాంగురాలి స్ఫూర్తిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నాయిరాల వలసకు చెందిన కొవ్వాడ స్వప్నిక్ ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగితే చాలామంది కుంగుబాటుకు గురవుతారు. కానీ స్వప్నిక మాత్రం తన కలలు నెరవేర్చుకునేందుకు ముందుడుగు వేసింది. నోటీతో బొమ్మలు గీయడం నేర్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖుల చిత్ర పటాలు గీసి మౌత్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
#Congratulations @alluarjun annayya#Pushpa
Thaggede le pic.twitter.com/WJnQy0CAI6 ఇవి కూడా చదవండి— @mouth Artist Swapnika (@PawanSister) August 26, 2023
చాలామంది లాగే స్వప్నిక కూడా మెగాభిమాని. చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను అమితంగా అభిమానిస్తుంది. అందుకే గతంలో పలుసార్లు చిరంజీవి, పవన్‌ల చిత్రపటాలను అద్భుతంగా గీసింది. ముఖ్యంగా స్వప్నిక ట్యాలెంట్‌కు ఫిదా అయిన పవన్ కల్యాణ్ ఒకసారి నేరుగా తనను కలిసి అభినందనలు తెలపడం విశేషం. అలాగే బాలకృష్ణ, విజయ్‌దేవరకొండ, స్మితా సబర్వాల్, అంబేడ్కర్, కేటీఆర్ లాంటి సినీ, రాజకీయ ప్రముఖుల బొమ్మలకు కూడా తన ట్యాలెంట్‌తో ప్రాణం పోసింది. ఇక స్వప్నికలో మరో సూపర్ ట్యాలెంట్ ఉంది. తను అద్బుతంగా డ్యాన్స్ చేయగలదు. ముఖ్యంగా మెగా హీరోల పాటలకు తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తుందీ ట్యాలెంటెడ్ గర్ల్. తన సోషల్ మీడియా ఖాతాలను చూస్తే తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.
నా వంతుగా నేను సమాసానికి ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉంటాను. నాలో దృఢ సంకల్పాన్ని నింపిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. @PawanKalyan @UAJanasainyam @JanaSenaParty @JSPVeeraMahila pic.twitter.com/zra9o7f3eF
— @mouth Artist Swapnika (@PawanSister) August 19, 2023
నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం తో నేను అభిమానించే మా అన్నయ్యలు డాన్స్ stepsu @offl_Lawrence , @KChiruTweets నేను వేశాను. pic.twitter.com/3dmi8CvOWl
— @mouth Artist Swapnika (@PawanSister) August 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.