Nitin Chandrakant Desai: సినీ పరిశ్రమలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్
పలువురు హార్ట్ స్టోక్స్ తో కన్నుమూయగా.. మరికొంతమంది యాక్సిడెంట్స్ లో కన్నుమూశారు. తాజాగా మరో విషాదం జరిగింది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కన్నుమూశారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్. అనుమాన స్థితిలో నితిన్ చంద్రకాంత్ దేశాయ్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం నింపింది. బాలీవుడ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా ఆయన ఎన్నో సినిమాల్లో పని చేశారు నితిన్ చంద్రకాంత్.
సినీ ఇండస్ట్రీ వరుస విషాదాలు కలిచివేస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రకరకాల కారణంగా కన్నుమూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. పలువురు హార్ట్ స్టోక్స్ తో కన్నుమూయగా.. మరికొంతమంది యాక్సిడెంట్స్ లో కన్నుమూశారు. తాజాగా మరో విషాదం జరిగింది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కన్నుమూశారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్. అనుమాన స్థితిలో నితిన్ చంద్రకాంత్ దేశాయ్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం నింపింది. బాలీవుడ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా ఆయన ఎన్నో సినిమాల్లో పని చేశారు నితిన్ చంద్రకాంత్.
బాలీవుడ్ లో నితిన్ చంద్రకాంత్ ఎన్నో అద్భుతమైన సినిమాలకు సెట్స్ వేశారు. బాలీవుడ్ లో ఆయన సలాం బాంబే, 1942 ఏ లవ్ స్టోరీ, కామసూత్ర, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, స్వేడ్స్, స్లమ్ డాగ్ మిలియనీర్, జోధా అక్బర్ లాంటి ఎన్నో సినిమాలకు పని చేశారు.
ఆర్ట్ డైరెక్టర్ గానే కాకుండా దర్శకుడిగానూ పని చేశారు చంద్రకాంత్. మరాఠీలో ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు చిన్న చిన్న పాత్రల్లో కూడా కనిపించారు. ఇక ఇప్పుడు ఆయన అనుమాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన మరణం వెనక కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఉరి వేసుకుని అనుమానాస్పద రీతిలో శవమై కనిపించడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.