Vijay Devarakonda : అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆతర్వాత అర్జున్ రెడ్డి కథను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్ లోనే రణ్ వీర్ సింగ్ తో సినిమా చేసే మంచి ఆఫర్ ను అందుకున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో కథను చెప్పి మెప్పించాడు. తాజాగా సందీప్ తెలుగులో మరో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సందీప్ సినిమా చేసేది ఎవరితోనో కాదు తన ఫస్ట్ సినిమా హీరో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే సందీప్ , విజయ్ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వీరిద్దరి కలయికలో ఓ ప్రాజెక్ట్ సెట్ చేస్తోందని తెలుస్తుంది. గతంలో విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పుడు విజయ్ తో మరో సినిమా చేయాలనీ చూస్తున్నారట మైత్రీ మూవీ మేకర్స్. ఇటీవల సందీప్ – విజయ్ కలిసి ఓ స్క్రిప్ట్ గురించి చర్చించారట. దీనిపై విజయ్ దేవరకొండ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీజగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :
మరో ప్రాజెక్టును స్టార్ట్స్ చేయనున్న మెగా హీరో.. ఈసారి నూతన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన తేజ్..