Tollywood: సెల్ఫీతో సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? తొలి సినిమానే కల్ట్ క్లాసిక్‌..

మిర్రర్ సెల్ఫీతో సెగలు పుట్టిస్తోన్న ఈ అందాల భామ ఎవరో గుర్తుపట్టారా.? మీకో చిన్న క్లూ ఇస్తున్నాం.. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం కల్ట్ క్లాసిక్.

Tollywood: సెల్ఫీతో సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? తొలి సినిమానే కల్ట్ క్లాసిక్‌..
Tollywood

Updated on: Feb 23, 2023 | 9:59 AM

మిర్రర్ సెల్ఫీతో సెగలు పుట్టిస్తోన్న ఈ అందాల భామ ఎవరో గుర్తుపట్టారా.? మీకో చిన్న క్లూ ఇస్తున్నాం.. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం కల్ట్ క్లాసిక్. ఆ తర్వాత పలువురు యువ హీరోల సరసన జత కట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికైనా ఆమె ఎవరో కనిపెట్టారా.? ఏంటి.! ఇంకా ఆ హీరోయిన్ ఎవరన్నది గుర్తుపట్టలేకపోయారా.? సరే మరో క్లూ..! మీకోసం.. టాలీవుడ్‌లో ఆమె చివరిగా అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రంలో కీలక పాత్ర చేసింది.

ఎస్..! మీరనుకున్నది కరెక్టే.. ఆమె మరెవరో కాదు షాలిని పాండే. ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన ముద్దుగుమ్మల్లో షాలిని పాండే ఒకరు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది ఈ భామ. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఈ చిన్నదానికి వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ చిత్రాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌ టాక్ తెచ్చుకోవడంతో పాటు సోసోగానే కలెక్షన్లు రాబట్టడంతో.. ఈ అమ్మడికి ఊహించని విధంగా తెలుగులో సినిమా ఛాన్స్‌లు తగ్గిపోయాయి. ఈమె చివరిసారిగా అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమాలో కనిపించింది. అనంతరం గతేడాది బాలీవుడ్‌లో ‘జయేష్‌భాయ్ జోర్దార్’ అనే మూవీ చేసినా.. షాలినికి నటిగా మంచి గుర్తింపు రాలేదు. ఇక ప్రస్తుతం ‘మహారాజా’ సినిమాతో బీ-టౌన్‌లో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది ఈ అందాల బ్యూటీ.