RK Roja: నా కూతురును కూడా ట్రోల్‌ చేస్తున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి ఆర్కే రోజా

నగరి నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి హోదాలో ఉన్నారు. కాగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్ద్‌స్త్ షోలో జడ్జిగా ఉన్న ఆమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం బుల్లితెరకు కూడా దూరమయ్యారు.

RK Roja: నా కూతురును కూడా ట్రోల్‌ చేస్తున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి ఆర్కే రోజా
Minister Rk Roja

Updated on: Dec 28, 2022 | 8:41 AM

స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు స్టార్‌ పొలిటిషియన్‌గా తన మార్క్‌ చూపిస్తున్నారు నటి రోజా. నటనకు విరామమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బిజీగా మారిపోయారామే. నగరి నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి హోదాలో ఉన్నారు. కాగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్ద్‌స్త్ షోలో జడ్జిగా ఉన్న ఆమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం బుల్లితెరకు కూడా దూరమయ్యారు. ఫుల్‌ టైమ్‌ పొలిటిషియన్‌గా బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఏపీ రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా కొనసాగుతోన్న రోజా ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. అందులో సినిమాలు, రాజకీయాల పరంగా తాను ఎదుర్కొంటోన్న ఒడిదొడుకులను పంచుకున్నారు. ముఖ్యంగా తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియా వేదికగా కొందరు చేస్తోన్న ట్రోల్స్ గురించి చెప్పి ఎమోషనల్‌ అయ్యారు.

నా కూతురును కూడా ట్రోల్‌ చేశారు..

‘నా కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్‌. తనది చాలా మృదు స్వభావం. అలాంటిది సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తన కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు చేశారు. వాటిని చూసి నా కుమార్తె చాలా బాధపడింది. ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ మొహం మీద నన్ను ప్రశ్నించింది. అలాగే నా సోదరుడి గురించి కూడా అభ్యంతరకరంగా మాట్లాడారు. అయితే సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సర్వసాధారణమని నా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాను’ అని భావోద్వేగానికి గురైంది రోజా. కాగా ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు అటు టాలీవుడ్, ఇటు ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..