
మరో రెండు రోజుల్లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆదిపురుష్ రిలీజ్ కాబోతుంది. డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా చిత్రయూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని థియేటర్లలోనూ ప్రతి టికెట్ కు రూ. 50 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. కానీ ఈ టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కేవలం పది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ మేరకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. ఇటు తెలంగాణలోనూ ప్రతి టికెట్ మీద రూ.50 పెంచుకునేందుకు టీఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులపాటు సింగిల్ స్క్రీన్స్ కు రూ.50 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అలాగే రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చు అని తెలిపింది.
రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై సెన్సేషన్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి.
దేశ వ్యాప్తంగా ఈ సినిమా టికెట్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే పలు థియేటర్లలో హౌస్ ఫుల్ బుకింగ్స్ కాగా.. మరోవైపు వెండితెరపై రాముడిగా ప్రభాస్‌ను వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.