Pawan Kalyan: తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చిన్న కూతురి తరఫున సంతకం

|

Oct 02, 2024 | 11:09 AM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం పవన్, ఆద్యతో పాటు చిన్న కూతురు పలీనా అంజలి కొణిదెల ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. అయితే పలీనా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది

Pawan Kalyan: తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చిన్న కూతురి తరఫున సంతకం
Deputy CM Pawan Kalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం పవన్, ఆద్యతో పాటు చిన్న కూతురు పలీనా అంజలి కొణిదెల ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. అయితే పలీనా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కూతురు సంతకం చేసింది. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఇటీవల మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ వివాదం నెలకొంది. హిందూ యేతరులు డిక్లరేషన్ పై సంతకం చేశాకే శ్రీవారి దర్శనానికి అనుమతివ్వాలంటూ కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దయ్యింది. ఈ వివాదం నడుస్తోన్న వేళ పవన్ కల్యాణ్ తన కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించడం, తండ్రిగా తానూ సంతకం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్ష ముగింపు కోసం ఆయన తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ శ్రీవారిని దర్శించుకుని, ఆ తర్వాత దీక్ష విరమించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇద్దరు కూతుళ్లతో పవన్ కల్యాణ్..

కాగా సుమారు రెండు రోజుల పాటు తిరుమ కొండపైనే పవన్ బస చేయనున్నారని తెలుస్తోంది. శ్రీవారి సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్ష విరమించి అన్న ప్రసాదం, లడ్డూ తయారీ ప్రక్రియలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.

 తిరుమలలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేస్తోన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..