Krishnam Raju Demise: కృష్ణంరాజు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన గవర్నర్
CM Jagan: ప్రముఖ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు (Krishnam Raju ) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
CM Jagan: ప్రముఖ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు (Krishnam Raju ) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రెబల్‌స్టార్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అదేవిధంగా కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ కృష్ణం రాజు మరణంపై వ్యక్తం చేశారు. చిత్రసీమకు రెబల్‌స్టార్ మృతి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కృష్ణంరాజు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేటి ఉదయం 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. వందలాది సినిమాల్లో నటించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తాచాటారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా సేవలందించారు. కాగా కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. 1940, జనవరి20న జన్మించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. కృష్ణం రాజు మరణ వార్త తెలిసి మొగల్తూరు లో విషాద ఛాయలు అలుముకున్నాయి.