AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను నాకు ఐలవ్‌యు చెప్పాడు.. నేను ఒకే చెప్పేశా..! ఫ్యాన్స్‌కు ఫ్యూజులెగిరిపోయే న్యూస్ చెప్పిన అనుష్క

తొలినాళ్లలో గ్లామర్ హీరోయిన్‌గా కనిపించిన అనుష్క.. కొద్ది కాలానికే తనలోని నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ‘అరుంధతి’లో జేజమ్మగా ఆమె చూపించిన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘వేదం’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’, ‘భాగమతి’ వంటి సినిమాల్లో బలమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

అతను నాకు ఐలవ్‌యు చెప్పాడు.. నేను ఒకే చెప్పేశా..! ఫ్యాన్స్‌కు ఫ్యూజులెగిరిపోయే న్యూస్ చెప్పిన అనుష్క
Anushka
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2026 | 8:05 PM

Share

టాలీవుడ్‌లో కథానాయికగా అడుగుపెట్టి దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. గ్లామర్ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ముఖ్యంగా అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి సినిమాలు అనుష్కకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే సినిమాల్లో ఎంత పాపులారిటీ ఉన్నప్పటికీ.. వ్యక్తిగత విషయాల విషయంలో మాత్రం అనుష్క చాలా ప్రైవేట్‌గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడని ఈ స్వీటీ.. అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో తన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటుంటారు. అలాంటి ఓ సందర్భంలో ఆమె చెప్పిన చిన్ననాటి ప్రేమ జ్ఞాపకం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్న అనుష్క.. తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటనను పంచుకున్నట్లు సమాచారం. ఓ అబ్బాయి తన దగ్గరకు వచ్చి నేరుగా ‘ఐ లవ్ యు’ అని చెప్పాడట.

అయితే అప్పటికి ప్రేమ అంటే ఏమిటో, ‘ఐ లవ్ యు’ అనే మాటకు అసలు అర్థం ఏమిటో కూడా తనకు తెలియదని అనుష్క చెప్పుకొచ్చారు. ఆ మాట విన్న వెంటనే ఏం చేయాలో తెలియక అమాయకంగా ‘సరే’ అని చెప్పేశానని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. చిన్న వయసులో జరిగిన ఆ సంఘటనను ఇప్పుడు తలుచుకుంటే చాలా అమాయకంగా, అందంగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. తన బాల్యంలో మిగిలిపోయిన మధురమైన జ్ఞాపకాల్లో అదొకటని చెప్పడంతో.. అనుష్క అభిమానులు కూడా ఈ విషయాన్ని ఆసక్తిగా షేర్ చేస్తున్నారు.

అనుష్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆమె వివాహం ఎప్పుడు జరుగుతుంది.? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు.? అనే ప్రశ్నలు అభిమానుల్లో చాలాకాలంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో ఓ పాన్ ఇండియా హీరోతో అనుష్కకు ప్రేమ సంబంధం ఉందంటూ గతంలో పలు సందర్భాల్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అలాంటి ప్రచారాలపై ఇద్దరూ పలుమార్లు స్పందిస్తూ తాము మంచి స్నేహితులమని స్పష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు అనుష్క ముంబైలో యోగా శిక్షకురాలిగా పనిచేశారు. ఆ సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ దృష్టిలో పడటంతో.. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సూపర్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us