
యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తూ అలరిస్తున్నాడు. ఇటీవలే లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంతోష్. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కళ్యాణం కమనీయం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సంతోష్ శోభన్. ప్రస్తుతం సంతోష్ చేతిలో మూడు సినిమాలు. `కళ్యాణం కమనీయం`..ప్రేమ్ కుమార్.. `అన్ని మంచి శకునాలే`. తాజాగా కళ్యాణం కామెనీయం సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇందులో సంతోష్ శోభన్ కి జోడీగా ప్రియా భవాని శంకర్ నటిస్తోంది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ట్రైలర్ లో సంతోష్ కు ప్రియకు పెళ్లి అయ్యినట్టు.. అయితే భార్య జాబ్ చేస్తే భర్త ఖాళీగా ఇంట్లో ఉండే పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో భార్య భర్తల మధ్య అందమైన బాండింగ్ తో పాటు చక్కటి ఎమోషన్స్ కూడా ఉండనున్నాయి.
ఈ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్గా హైలైట్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతుండటం విశేషం. ఇప్పటికే సంక్రాంతి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఉండగా ఈ చిన్న సినిమాను కూడా అదే సమాయంలో రిలీజ్ చేయనున్నారు.