AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: ఇప్పుడు నవ్వుతూ అడుగుతున్నారు.. అప్పుడెందుకు అలా.. అనుపమ కామెంట్స్..

గతంలో రిలీజ్ అయిన డీజే టిల్లు సూపర్ హిట్ కాగా.. ఈసారి టిల్లు స్వ్కేర్ మూవీతో మళ్లీ గట్టిగానే నవ్వించాడని అంటున్నారు అడియన్స్.. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో నిన్న సాయంత్రం చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించని అనుపమ.. సక్సెస్ మీట్ లో పాల్గొంది

Anupama Parameswaran: ఇప్పుడు నవ్వుతూ అడుగుతున్నారు.. అప్పుడెందుకు అలా..  అనుపమ కామెంట్స్..
Anupama Parameswaran
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2024 | 7:21 AM

Share

మోస్ట్ అవైటెడ్ మూవీ టిల్లు స్వ్కేర్ అడియన్స్ ముందుకు వచ్చేసింది. మార్చి 29న థియేటర్లలో గ్రాండ్‏గా రిలీజ్ అయ్యింది. మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకులకు అన్‎లిమిటెడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించాడు సిద్ధూ జొన్నలగడ్డ. గతంలో రిలీజ్ అయిన డీజే టిల్లు సూపర్ హిట్ కాగా.. ఈసారి టిల్లు స్వ్కేర్ మూవీతో మళ్లీ గట్టిగానే నవ్వించాడని అంటున్నారు అడియన్స్.. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో నిన్న సాయంత్రం చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించని అనుపమ.. సక్సెస్ మీట్ లో పాల్గొంది. ఇదే కార్యక్రమంలో మరోసారి బోల్డ్ క్యారెక్టర్ కామెంట్స్ పై స్పందించింది అనుపమ. ఈ సినిమాలోని లిల్లి పాత్ర వదులుకుంటే మంచి అవకాశాన్ని మిస్ అవుతానని చెప్పుకొచ్చారు.

ఈ మూవీ సక్సెస్ మీట్ లో మరోసారి అనుపమకు ఇన్నాళ్లు ఇలాంటి బోల్డ్ పాత్ర చేయలేదు.. ఇప్పుడేందుకు చేశారని ప్రశ్నించారు. ఇందుకు అనుపమ మాట్లాడుతూ.. “ఈ సినిమా చూసిన తర్వాత కూడా మీకు నా క్యారెక్టర్ బోల్డ్ అనిపిస్తుందా ?.. ఇప్పుడు ఈ ప్రశ్నను నవ్వుతూ అడుగుతున్నారు. విడుదలకు ముందు మాత్రం అలా అడగలేదు. మీరు సినిమా చూసి కన్వెన్స్ అయ్యారు కాబట్టి నవ్వుతూ అడుగుతున్నారు. నేను కూడా రిలీజ్ కు ముందే ఇదే మాట చెప్పాను. ఈ సినిమాలోని లిల్లి పాత్రను వదులుకుంటే మంచి అవకాశం వదులుకున్నట్లు అవుతుంది. ఈ పాత్రలలో నేను కొత్తగా కనిపించానని మీరే అంటున్నారు. అందుకే ఆ పాత్ర చేశాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ జోడిగా అనుపమ కనిపించింది. విడుదలకు ముందు రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, పాటలలో అనుపమ గ్లామర్ షోతో కనిపించడంతో అభిమానులను కోపంతో ఊగిపోయారు. అనుపమ ఇన్ స్టా పోస్టులపై కొందరు దారుణంగా విమర్శలు చేశారు. ఇన్నాళ్లు మంచి పాత్రలు చేసిన నువ్వు.. ఇలా ఎందుకు మారిపోయావు అంటూ విమర్శించారు. దీంతో అనుపమ హర్ట్ అయి ఈ మూవీ ప్రమోషన్లలో కూడా అంతగా పాల్గొనలేదు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ పాల్గొనలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా