Anni Manchi Sakunamule: ఓటీటీలో దూసుకుపోతోన్న నందిని రెడ్డి అన్ని మంచి శకునములే..

|

Jun 21, 2023 | 9:16 AM

ఇక ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ అయిన నెల రోజుల తరవాత ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన అన్ని మంచి శకునములే అనే సినిమా రిలీజ్ అయ్యింది.

Anni Manchi Sakunamule: ఓటీటీలో దూసుకుపోతోన్న నందిని రెడ్డి అన్ని మంచి శకునములే..
Anni Manchi Sakunamule
Follow us on

ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరుకుతోంది. లాక్ డౌన్ సమయంలో చాలా ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. థియేటర్ రిలీజ్ కు నోచుకోని పలు సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ అయిన నెల రోజుల తరవాత ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన అన్ని మంచి శకునములే అనే సినిమా రిలీజ్ అయ్యింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాలో యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటించారు. అలాగే మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాలో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్‌, మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో ప్రేక్షకులను ఆదరిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో ఇప్పుడు అన్నిమంచి శకునములే..మూవీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. కానీ థియేటర్స్ లో మాత్రం తెలుగులోనే రిలీజ్ చేశారు.