ఏం ఫీల్ ఉంటుంది భయ్యా ఈ సాంగ్‌లో..!! అప్పటిలో ఓ ఊపు ఊపేసింది.. వింటుంటేనే..

|

Jun 10, 2024 | 7:48 AM

సినిమా ఎంత డిజాస్టర్ అయినా ఆ సినిమాలో ఒక పాట హైలైట్ అవుతుంది. ఇక కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి ఊపున్న సాంగ్స్ తో పాటు అదే రేంజ్ లో ఫీల్ ఉన్న సాంగ్స్ కూడా కంపోజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడంటే సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. ఏ సాంగ్ కావాలన్న మనకు సోషల్ మీడియాలో దొరికేస్తుంది. కానీ 90's  కిడ్స్ టైం‌లో అలా కాదు. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉండేవి.. ఆ రోజులు తిరిగి రావు అలాగే అప్పటి సాంగ్స్ కూడా..

ఏం ఫీల్ ఉంటుంది భయ్యా ఈ సాంగ్‌లో..!! అప్పటిలో ఓ ఊపు ఊపేసింది.. వింటుంటేనే..
Anitha O Anitha
Follow us on

సినిమాలతో పాటు సినిమా సాంగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వలేకపోయినా మ్యూజికల్ హిట్స్ గ నిలిచినా సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. సినిమా ఎంత డిజాస్టర్ అయినా ఆ సినిమాలో ఒక పాట హైలైట్ అవుతుంది. ఇక కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి ఊపున్న సాంగ్స్ తో పాటు అదే రేంజ్ లో ఫీల్ ఉన్న సాంగ్స్ కూడా కంపోజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడంటే సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. ఏ సాంగ్ కావాలన్న మనకు సోషల్ మీడియాలో దొరికేస్తుంది. కానీ 90’s  కిడ్స్ టైం‌లో అలా కాదు. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉండేవి.. ఆ రోజులు తిరిగి రావు అలాగే అప్పటి సాంగ్స్ కూడా.. సినిమా పాటలతో పాటు ప్రైవేట్ సాంగ్స్ కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకునేవి. జానపదాలతో పాటు ప్రేమ పాటలు కూడా రిలీజ్ అయ్యే అలరించేవి.

ఒకప్పుడు వయసులో ఉన్న ప్రతి కుర్రాడి ఫోన్ లో వినిపించిన సాంగ్ అనిత ఓ అనిత న అందమైన వనిత అనే సాంగ్. ఓ భగ్నప్రేమికుడు తన ప్రేయసిని తలుచుకుంటూ పాడిన ఈ పాట చాలా ఫేమస్. ఈ పాట వింటుంటేనే తెలియని ఓ ఫీలింగ్ వస్తుంది. మనం ప్రేమించిన అమ్మాయి కూడా మనల్ని వదిలేసి వెళ్లినట్టు.. మనమే ఆ పాట పడినట్టు అనిపిస్తుంది. అంతేకాదు లవ్ లో ఫెయిల్ అయినా చాలా మంది కుర్రాళ్ళు ఈ పాటను తమ ఫోన్ రింగ్ టోన్స్ గా పెట్టుకునేవారు. ఈ సాంగ్ లో లిరిక్స్ హృదయాలను తాకేలా ఉంటాయి.

అనిత ఓ అనిత సాంగ్ ఓ మాస్టర్ పీస్. 2008లో వచ్చిన ఈ పాట సంచలనంగా మారింది. అయితే ఈ పాట రాసింది ఎవరు.? పడింది.? ఎవరు అని చాలా మంది సోషల్ మీడియాను గాలిస్తున్నారు. కాగా ఈ పాటను రాసింది. పాడింది ఒక్కరే..ఆయన పేరు గుణిపార్తి నాగరాజు. హనుమకొండ జిల్లాకు చెందిన నాగరాజు తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ పాట పాడాడు. డిగ్రీ చదువుతున్నప్పుడు తాను, ఓ అమ్మాయి ప్రేమించుకున్నామని ఆమె వదిలేసి వెళ్లిపోవడంతో తాను ఇలా బాధతో ఓ పాట రాసాను అని తెలిపాడు. కాగా నాగరాజు ఇంట్లో అందరూ సింగర్స్, రైటర్సే .. పల్లె పాటలు రాస్తూ ఆలపిస్తుంటారు. ఇక అనిత సాంగ్ తర్వాత నాగరాజు చాలాపాటలు రాసాడు, పాడాడు కానీ అవి అనితా సాంగ్ అంత పాపులర్ అవ్వలేదు. ఈ సాంగ్ పై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..