AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఎట్టకేలకు ప్రభాస్ హీరోయిన్ ఫిక్స్.. సందీప్ రెడ్డి వంగా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. అఫీషియల్ ప్రకటన..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చివరిసారిగా కల్కి 2898 ఏడీ సినిమాతో హిట్టు అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల తర్వాత ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు.

Prabhas: ఎట్టకేలకు ప్రభాస్ హీరోయిన్ ఫిక్స్.. సందీప్ రెడ్డి వంగా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. అఫీషియల్ ప్రకటన..
Prabhas
Rajitha Chanti
|

Updated on: May 24, 2025 | 6:46 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు డార్లింగ్. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాలతోపాటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ వచ్చేసింది. అఫీషియల్ ప్రకటన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని.. ఈ మూవీలో కనిపించే హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తుందని.. ఆమెతోపాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారని టాక్ నడిచింది. ఇటీవలే స్పిరిట్ నుంచి దీపికాను తొలగించారనే ప్రచారం సైతం చక్కర్లు కొట్టింది. తాజాగా స్పిరిట్ మూవీ హీరోయిన్ ఎవరనేది అధికారిక ప్రకటన వెల్లడిస్తూ రూమర్స్ కు చెక్ పెట్టారు మేకర్స్.

ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి నటించనున్నట్లు టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. స్పిరిట్ మూవీని రిలీజ్ చేసే అన్ని భాషల్లో ఆమె పేరును ఓ పోస్టర్ పై రిలీజ్ చేశారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి నేషనల్ లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది త్రిప్తి. ఇప్పుడు మరోసారి ఆమెకే ఛాన్స్ ఇచ్చారు సందీప్ రెడ్డి. యానిమల్ సినిమాతోనే ఇండియా వైడ్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న త్రిప్తి.. ఇప్పుడు ప్రభాస్ మూవీతో మరింత క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

స్పిరిట్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే