గతేడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సినిమా యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బీటౌన్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటివరకు థియేటర్లలో ఊహించని రెస్పా్న్స్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా జనవరి 26న అందుబాటులోకి వస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. అయితే ఇప్పుడు ఓటీటీ విడుదలను ఆపాలంటూ సినీ 1 స్టూడియోస్, సహ నిర్మాత సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.
యానిమల్ సినిమా నిర్మాణంలో ముందుగా చేసుకున్న అగ్రిమెంట్‌ను టీసిరీస్ ఉల్లంఘించిందని.. తమకు ప్రాఫిట్స్ పంచడంలో కానీ మరికొన్ని పనులు తమకు చెప్పకుండానే టీసిరీస్ చేసిందని ఆరోపించింది సినీ 1 స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్. అందుకే సినిమా ఓటీటీ రిలీజ్ ఆపాలంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీనిపై టీ సిరీస్ తరపు న్యాయవాదులు మాత్రం ఈ సినిమా హక్కులను సినీ 1 స్టూడియోస్ వారు టీ సిరీస్ కి 2.2 కోట్లకు వదులకున్నారన్న విషయాన్ని దాచి ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయని అడుగుతుననారని.. వారికి ఈసినిమాకు సంబంధం లేదని సూచించారని తెలుస్తోంది.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. డాక్యుమెంట్ క్లారిటీ ఇవ్వాలని సినీ 1 స్టూడియోస్ సంస్థకు సూచించింది. తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. సినీ 1 స్టూడియోస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ మాట్లాడుతూ, ఈ చిత్రం సంపాదించిన ఆదాయం, బాక్సాఫీస్ వద్ద దాని కలెక్షన్, సంగీతం, శాటిలైట్ లేదా ఇంటర్నెట్ హక్కుల గురించి వాదికి ఎటువంటి సమాచారం రాలేదన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెండు నిర్మాణ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.