త్రిప్తి దిమ్రి.. ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ అమ్మడి గురించే చర్చ జరుగుతోంది. యానిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రి రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. బాలీవుడ్ లో త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా సహాయక పాత్రల్లో నటించి మెప్పించింది. 2017లో వచ్చిన పోస్టర్ బాయ్స్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది త్రిప్తి దిమ్రి. రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను(2018)లో ఆమె మొదటి ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. త్రిప్తి దిమ్రి యానిమల్ సినిమాలో నటించి మెప్పించింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బేర్ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదలైంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి కీలక పాత్రలో నటించింది.
ముఖ్యంగా రణబీర్ కపూర్ తో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది త్రిప్తి దిమ్రి. ఇటీవలే ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో త్రిప్తి దిమ్రి మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. సౌత్ లో ఏ హీరోతో నటించాలని ఉంది అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.
సౌత్ లో ఎవరితో కలిసి నటించాలని ఉంది .? అని ప్రశ్నకు త్రిప్తి దిమ్రి మాట్లాడుతూ.. తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో కలిసి నటించాలని ఎదురుచూస్తున్నానని తెలిపింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించనున్నారని టాక్.
#Animal Album Out Now ❤️🔥🎶https://t.co/U2m5LPLShu#AnimalAlbum#AnimalOn1stDec #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar @rameemusic #MananBhardwaj @shreyaspuranik @jam8studio @VishalMMishra pic.twitter.com/HTGn2MwOnv
— Triptii Dimri (@tripti_dimri23) November 25, 2023
— Triptii Dimri (@tripti_dimri23) December 20, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..