OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా టికెట్ రేట్ల పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ.. ధరల వివరాలివే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు అధికారిక అనుమతులు వచ్చాయి.

OG Movie: పవన్ కల్యాణ్ ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ.. ధరల వివరాలివే
Pawan Kalyan OG Movie

Updated on: Sep 19, 2025 | 10:06 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాకి టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు బుధవారం (సెప్టెంబర్ 17) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా నిర్మాత DVV ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత దానయ్య విజ్ఞప్తి మేరకు ఈ అనుమతులు జారీ చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబరు 25న అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్‌ షో వేయనున్నారు. దీనికి టికెట్‌ ధర రూ.1000 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించారు. ఇక సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.125 (జీఎస్టీ కలిపి), మల్టీప్లెక్స్‌లో రూ.150 (జీఎస్టీ కలిపి) వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. కాగా ఓజీ సినిమా టికెట్ల పెంపునకు అనుమతులిచ్చిన ఏపీ ప్రభుత్వానికి ఓజీ నిర్మాత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్ర బాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

కాగా పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఓజీ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫైర్ స్ట్రోమ్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత రిలీజైన మెలొడీ సాంగ్, లేటెస్ట్ గా వచ్చిన గన్స్ అండ్ రోజెస్ సాంగ్ కూడా ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.