AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udaya Bhanu: ఆ స్టార్ హీరోకు కొంచెం కూడా గర్వం లేదు.. నాకు ఆయనలో దేవుడు కనిపించాడు.. ఉదయభాను కామెంట్స్

స్టార్ యాంకర్, ప్రముఖ నటి ఉదయ భాను నిర్మాతగా మారి తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'పంచనామా'. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇందులోని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తున్నాయి .

Udaya Bhanu: ఆ స్టార్ హీరోకు కొంచెం కూడా గర్వం లేదు.. నాకు ఆయనలో దేవుడు కనిపించాడు.. ఉదయభాను కామెంట్స్
Udaya Bhanu
Basha Shek
|

Updated on: Sep 13, 2026 | 4:03 PM

Share

స్టార్ యాంకర్, ప్రముఖ నటి ఉదయ భాను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై ఎన్నో సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ కు ర్ గా వ్యవహరించిందీ అందాల తార. ముఖ్యంగా వన్స్ మోర్ ప్లీజ్, హృదయాంజలి, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ఢీ’ (డ్యాన్స్ షో), ‘జాక్‌పాట్’, ‘సాహసం చేయరా డింభకా’ వంటి ఎన్నో సూపర్ హిట్ షోలకు యాంకర్ గా చేసింది ఉదయ భాను. కేవలం టీవీ షోలతోనే కాదు సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. సహాయక నటి పాత్రల్లోనూ, స్పెషల్ సాంగ్స్ తోనూ మెప్పించింది. ఇదిలా ఉంటే కెరీర్ స్పీడ్ గా ఉన్న టైం లోనే సినిమా ఇండస్ట్రీకి దూరమైంది ఉదయ భాను. చాలా రోజులుగా సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉండిపోయింది. అయితే ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తోంది ఉదయ భాను. టీవీ షోల్లో సందడి చేస్తోనూ సినిమాల్లోనూ పవర్ ఫుల్ రోల్స్ చేస్తోంది. ఇక ఇటీవలే ఉదయభాను కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నిర్మాతగా మారి తన తొలి నిర్మాణంలో ‘పంచనామా’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఇటీవల జీ 5 ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న ఉదయ భాను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కాగా గతంలో హీరో బాలకృష్ణతో తన అనుబంధాన్ని చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది ఉదయ భాను.

‘ నేను 12 సంవత్సరాల వయసులో సినిమా కెరీర్ ను మొదలు పెట్టాను. దీంతో అప్పటినుంచే నా జీవితంలో ఎలాంటి పండగలు, వేడుకలు, సెలబ్రేషన్స్ లేవు. అయితే ఆడపిల్లలన్నాక కొన్ని కోరికలు ఉంటాయి. అందులో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ కోరికలు ఇంకా పెరుగుతాయంటారు. ముఖ్యంగా సీమంతం చేసుకోవాలని గర్భం ధరించిన మహిళలందరూ కోరుకుంటారు. కానీ నా పరిస్థితి చాలా డిఫరెంట్. నాకు ఇవేవీ జరగలేదు. దీని వల్ల ఒకానొక సమయంలో దేవుడు లేడు ఏమో అని అనుకున్నాను. అయితే అదృష్టవశాత్తూ ఆ దేవుడి దయతో నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిన ఆనందం నా ఇద్దరు కవల బిడ్డల రూపంలో తిరిగొచ్చింది. అలాంటి కవల పిల్లల తొలి బర్త్ డేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. అందులో భాగంగానే నా బిడ్డల బర్త్ డే సెలబ్రేషన్స్ కు రావాలని చాలా మందికి ఫోన్ చేశాను. కానీ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చివరిగా హీరో బాలకృష్ణకు ఒక మెసేజ్ పెట్టాను. అరగంట తర్వాత స్వయంగా బాలయ్య నే ఫోన్ చేశారు. నా పిల్లల పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు కచ్చితంగా వస్తానని మాట ఇచ్చారు. ఆ సమయంలో బాలయ్యకు వేరే ప్రాంతంలో మీటింగ్ ఉన్నా ఆ మీటింగ్ ను పూర్తి చేసి కరెక్టుగా చెప్పిన సమయానికి ఇంటికి వచ్చారు బాలయ్య. ఆ సమయంలో ఆయన నాకు ఒక దేవుడిలా కనిపించారు. ఇతర సెలబ్రిటీల్లా ఐదారు నిమిషాలు ఉండిపోకుండా 45 నిమిషాల పాటు మా ఇంట్లోనే ఉండి అందరితో సరదాగా గడిపారు. అడిగిన వారందరికీ నవ్వుతూ ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చారు. ఆయన లాంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు’ అని బాలయ్య గురించి గొప్పగా చెప్పుకొచ్చింది ఉదయ భాను

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us