యాంకర్ రవి దగ్గరి నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేసిన ఓ వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టాడు యాంకర్ రవి. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిస్ట్రిబ్యూటర్ సందీప్ అనే వ్యక్తి తన దగ్గరి నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ రవి పోలీసులని ఆశ్రయించాడు. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో డబ్బులు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. విచారణ చేస్తామన్నారు.
అయితే.. 2018 అక్టోబర్‌లో యాంకర్ రవి మీద ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు సందీప్. రవి తనను బెదిరిస్తున్నాడని, శారీరకంగా హాని చేస్తానని హెచ్చరించాడని, డబ్బులు ఇవ్వాలని టార్చర్ చేస్తున్నాడని సందీప్ పోలీసులను ఆశ్రయించాడు. గతంలో ‘ఇది మా ప్రేమ కథ’ సినిమాకి సందీప్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయితే అప్పట్లో రవి, సందీప్‌కి డబ్బులు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ సందీప్ సమాధానం చెప్పకపోవడంతో రవి.. ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు.