Rashmi Gautam: నాగార్జున సార్ ప్లీజ్ అంటూ యాంకర్ రష్మీ స్పెషల్ రిక్వెస్ట్.. దేనికోసమంటే

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టింది. జబర్దస్త్ కామెడీ షో తో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది.

Rashmi Gautam: నాగార్జున సార్ ప్లీజ్ అంటూ యాంకర్ రష్మీ స్పెషల్ రిక్వెస్ట్.. దేనికోసమంటే
Rashmi Gautam

Updated on: Feb 21, 2025 | 7:45 AM

బుల్లితెరపై తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతుంది అందాల భామ రష్మీ గౌతమ్. ప్రముఖ టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ కామెడీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు ఈ చిన్నదాని అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. వచ్చిరాని తెలుగుతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఆకట్టుకుంది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ తో పాటు పలు టీవీ షోలు చేస్తూ ప్రస్తుత ఎం ఫుల్ బిజీగా గడిపేస్తుంది ఈ చిన్నది. అయితే కెరీర్ బిగినింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది ఈ చిన్నది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గా నటించింది. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. టీవీ షోల ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

రష్మీ టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. గతంలో కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. గుంటూరు టాకీస్ సినిమాలో తన అందాలతో కవ్వించింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలోనూ చిన్న పాత్రలో మెరిసింది. అయితే అప్పట్లో రష్మీ ఓ సీరియల్ లోనూ నటించింది దాని పేరే యువ. యూత్  ను ఆకట్టుకునే కంటెంట్ తో వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో యువ సీరియల్ క్లిప్స్ కొన్ని వైరల్ గా మారాయి. అలాగే ఈ సీరియల్ లో రాజమౌళి గెస్ట్ గా కనిపించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రష్మీ, రాజమౌళి క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఆ సీరియల్ హాట్ టాపిక్ గా మారింది. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ రష్మీ అలానే ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సీరియల్ గురించి రష్మీ స్పందిస్తూ.. హీరో నాగార్జునకు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. యువ సీరియల్ రీ యూనియన్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది.. అంటూ నాగార్జునకు రిక్వెస్ట్ పెట్టింది రష్మీ గౌతమ్. ఈమేరకు ఆమె ఎక్స్ (ట్విట్టర్) లో ట్వీట్ చేసింది. మరి నాగ్ ఈ అమ్మడికి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.