స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షో తో ఫుల్ ఫేమస్ అయిపోయింది. తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఓవైపు పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార. అయితే బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండితెరపై మాత్రం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రావడం లేదు. దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ టీవీ షోలపైనే పెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అదేంటంటే.. రష్మీ తాతయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. తనకు ఎంతో ఇష్టమైన తాతయ్య మరణన్ని తట్టుకోలేని రష్మిక సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను షేర్ చేసిన యాంకర్ రష్మీ..
‘మా తాత నిజమైన స్త్రీవాది. ఎట్టకేలకు ఆయన స్వర్గంలో మా బామ్మను కలుసుకున్నారు. ఈ ఆగస్టు 17వ తేదీన మా తాతయ్య ఆనారోగ్యంతో మరణించారు. ఆయనకు తుది వీడ్కోలు పలికాం. ఇక మా బామ్మ తాతయ్య మనసులు విడదీయలేనివి. ఎందుకంటే.. మా బామ్మ భౌతికంగా దూరమయ్యాక ఆయన ఎంత కుమిలిపోయారో మాకు తెలుసు. గత ఏడాదిన్నర నుంచి ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ నాకు గుర్తుంది. మన అవసరాల కోసం బామ్మ, తాతయ్యలు మనతోనే ఉండాలని మనం అనుకుంటాం. కానీ, ఆయనకు మా బామ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది రష్మి. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు స్ట్రాంగ్ గా ఉండాలంటూ ధైర్యం చెబుతున్నారు. ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Finally reunited in heavenly abode
A true feminist my grandfather was
17 Aug 2024 we bid our grandfather final good bye
Their souls were inseparable
We knew how difficult it was for him being away from her
He spoke about her everyday the last 1:5 year
We always needed them…— rashmi gautam (@rashmigautam27) August 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.